విజయాలను చాటిచెప్పేందుకే..
మంథని: తమ ప్రభుత్వం ఏడాదిలో సాధించిన వి జయాలను చాటిచెప్పేందుకే విజయోత్సవాలు చేప ట్టామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. స్థా నిక శివ కిరణ్ గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మాట్లాడారు. పేదలకు 200 యూ నిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు కార్పొరే ట్ వైద్యం వంటి పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత పదేళ్లలో ఉద్యోగాలు లేకచా లా కష్టాలు పడ్డ నిరుద్యోగుల కోసం 10 నెలల్లోనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు ఒకేచోట చదువుకునేలా అడవిసోమనపల్లి ప్రాంతంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల ని ర్మాణం చేపట్టామన్నారు. 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపా రు. సన్నవడ్లకు రూ.500 బోనస్ అందిస్తున్నామని, జిల్లాలో బోనస్ కింద ఇప్పటివరకు రూ.20 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమచేశామని వివరించారు. గతంలో మాదిరిగా గుట్టలు, రోడ్లకు కాకుండా అసలైన రైతులు, కౌలు రైతులకు లబ్ధి చేకూరేలా రైతుభరోసా పథకం ప్రవేశ పెడతామని మంత్రి వెల్లడించారు. మంథని సమీపంలో 150 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ చిన్న ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, దీనికి అవస రమైన స్థలం ఎంపిక చేయాలని కలెక్టర్‌కు సూచించారు. బహుళజాతి కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించేలా నైపుణ్య కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం అంతడుపుల నాగరాజు సారథ్యంలోని కళాకారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షించాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ పెండ్రు రమాదేవి, వైస్‌చైర్మన్ సీపతి బానయ్య ఉన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
కాగా, వివిధ ప్రాంతాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఖానాపూర్‌లో రూ.7 కోట్ల వ్యయంతో ఖానాపూర్ – ఎల్. మడుగు మధ్య చేపట్టిన డబల్ రోడ్డు, రూ.20 లక్షల వ్యయంతో నాగారంలో హెల్త్ సబ్ సెంటర్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
వచ్చే నాలుగేళ్లలో మరింత అభివృద్ధి
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment