కల్లోలిత ప్రాంతం నుంచి..
సిరిసిల్లక్రైం: మాది వ్యవసాయం కుటుంబం. అమ్మానాన్న లక్ష్మి–లచ్చయ్య పొలం పనులు చేస్తారు. బీటెక్ పూర్తవగానే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నాలు చేసిన. అన్నయ్య టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌గా ఉన్నారు. ఎస్సై ఉద్యోగం కోసం పరీక్ష రాస్తానని చెబితే ప్రోత్సహించి కరీంనగర్‌లోని ఓ అకాడమీలో చేర్పించారు. ఎస్సై రాకపోయిన కానిస్టేబుల్ వచ్చింది. తొలి ప్రయత్నంలో రావడం, ఇంట్లో ఇద్దరం పోలీసులం ఉండడంతో తల్లిదండ్రులకు ఆనందంగా ఉంది. కరీంనగర్‌లో శిక్షణ పూర్తయింది. సిరిసిల్ల ఠాణాలో విధుల్లో చేరిన. ఎస్సై కోసం ప్రయత్నిస్తా. ఒకప్పు డు కోనరావుపేట అంటేనే కల్లోలిత నక్సలైట్ ప్రాంతం. కానీ ఇప్పుడు తీరు మారింది. పోలీసు ఉద్యోగం చేయడానికి తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు. నాలాగా మరింత మంది పోలీసు డ్యూటీలోకి రావాలని ఆకాంక్ష.
– కె.శిరీష, కోనరావుపేట
Comments
Please login to add a commentAdd a comment