యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): గోదావరిఖని నుంచి శబరిమలకు ఆర్టీసీ బస్సులు నడుపుతామని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. స్థానిక శ్రీఅయ్యప్పస్వామి ఆలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శబరిమల గోదావరిఖని, పెద్దపల్లి నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల కోసం సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను అద్దెప్రాతిపదికన కేటాయిస్తామన్నారు. ఇవి నాలుగు రాష్టాల నుంచి ఆరురోజుల పాటు ప్రయాణిస్తాయని ఆయన తెలిపారు. ఇందులో 12 యాత్రలు ఉంటాయని పేర్కొన్నారు. అఽధికారుల సూచన మేరకు భక్తులకు నచ్చిన రెండు రూట్లను ఎంచుకోవాలని ఆయన సూచించారు. భక్తులకు నచ్చిన మార్గంలోనూ సుమారు 3,300 కి.మీ. దూరం వరకు బస్సులను అద్దెకు ఇస్తామన్నారు. రిజర్వేషన్ చేసుకున్న భక్తుల కోసం శబరిమలలో స్వామిదర్శనం కోసం ఆర్టీసీ ప్రత్యేక వలంటీర్లను నియమించిందని ఆయన పేర్కొన్నారు.
13 నుంచి అరుణాచలం యాత్ర
గోదావరిఖని నుంచి ఈనెల 13, 14, 15వ తేదీల్లో అరుణాచలం యాత్రకోసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తోందని డీఎం నాగభూషణం వెల్లడించారు. నిష్ణాతులైన ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి సరైన సమయాల్లో దైవదర్శం చేసి సురక్షితంగా ఇంటికి చేర్చుతారని ఆయన అన్నారు. శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే భక్తులు, మాలలు ధరించిన స్వాములు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రిజర్వేషన్ కోసం 99081 38036, 73828 47427 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ గీతాకృష్ణ, అధికారులు కేఆర్‌రెడ్డి, ఎస్‌ఎస్ మూర్తి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్, ఉపాధ్యక్షుడు స్టాలినగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వివిధ పుణ్యక్షేత్రాల సందర్శన
శబరిమలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం
గోదావరిఖని డీఎం నాగభూషణం
Comments
Please login to add a commentAdd a comment