వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం
● పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్
పెద్దపల్లిరూరల్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీ య జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ అన్నారు. ఇటీవల దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దక్కిన ప్రజాదరణే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. ‘కాంగ్రెస్ పార్టీ ఆరు అబద్ధాలు, అరవై ఆరు మోసాలు’ పేరిట బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండాచౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ప్రదీప్ కుమార్ మాట్లాడారు. గతఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఓట్ల శాతం తక్కువగా వచ్చిందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఇక బీజేపీయేనని అన్నారు. విపక్షాలన్నీ ఏకమైనా కేంద్రంలో మూడోసారి మోదీనే గెలిపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోమాస శ్రీనివాస్, గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి, శిలారపు పర్వతాలు, కాసిపేట శివాజీ, లావణ్య, తిరుపతి, ఎర్రోళ్ల శ్రీకాంత్, తంగేడ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, బైక్ ర్యాలీలో ఓ యువకుడు జెండా లాక్కొని పరుగెత్తగా బీజేపీ శ్రేణులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment