క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
గోదావరిఖని: క్రమశిక్షణ, నిజాయతీతో విధులు నిర్వర్తించాలని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ కొత్త కానిస్టేబుళ్లకు సూచించారు. ఇటీవల ఉద్యోగంలో చేరిన ఏఆర్ కానిస్టేబుళ్లతో మంగళవారం తన కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఉద్యోగ ప్రయత్నంలో అనేక సవాళ్లను ఎదర్కొన్న ఉన్నత విద్యావంతులు నిబద్ధతతో ఉద్యోగ ధర్మం నిర్వర్తించాలన్నారు. సమయపాలన పాటించాలని, అధికారుల సలహాలు, సూచనలతో ముందుకు సాగాలని అన్నారు. ధర్నాలు, రాస్తారోకోల సందర్భంగా ఆందోళనకారులతో సమయస్ఫూర్తితో ప్రవర్తించాలని పేర్కొన్నారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్‌రావు, ఆర్‌ఐలు దామోదర్, వామనమూర్తి, శ్రీనివాస్, మల్లేశం, సంపత్ పాల్గొన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై నిషేధం
సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌ల బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై నిషేధాజ్ఞలు పొడిగిస్తున్నామని పోలీసు కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా డీజేలు, డ్రోన్‌లపైనా నిషేధాజ్ఞలు పొడిగిస్తున్నామన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, పేషెంట్లు, విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించామన్నారు.
● రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment