నిర్దేశిత గడువులోగా సీఎమ్మార్ అప్పగించాలి
పెద్దపల్లిరూరల్: జిల్లా లోని రైస్‌మిల్లర్లు 2022–23 యాసంగి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్)ను గడువులోగా అప్పగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం అ దనపు కలెక్టర్ వేణుతో కలిసి పెండింగ్ సీఎమ్మార్‌పై సమీక్షించారు. 2022–23 యాసంగి సీఎమ్మార్‌ను ఇప్పటివ రకు 60శాతమే అప్పగించారని, మిగతా బి య్యాన్ని ఈనెల 31లోగా అప్పగించాలని సూ చించారు. ఆలస్యం చేస్తున్న రైస్ మిల్లుల్లో తని ఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇకముందు గడువు పెంపు ఉండదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, అధికారి రాజేందర్, రైస్‌మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ స్ఫూర్తిని అవమానించడమే..
గోదావరిఖని: తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అంటే తెలంగాణ స్ఫూర్తిని అవమా నించడమేనని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కో రుకంటి చందర్ విమర్శించారు. స్థానిక ము న్సిపల్ కార్యాలయం సమీపంలోని తెలంగా ణ తల్లి విగ్రహానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్ర జల ఆకాంక్షలకు అనుగుణంగా మలిదశ ఉద్యమంలో అనివార్యంగా అస్తిత్వభావన ముందుకొచ్చింన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి రూపానికి అంకురార్పణ చేశారని, కొత్త తెలంగాణ తల్లి పేరిట కాంగ్రెస్ కుట్ర చేస్తోందని దు య్యబట్టారు. తెలంగాణ సాంస్కృతిక వారస త్వం పాలకులకు కనీస సోయిలేకుంటా పో తోందని విమర్శించారు. నాయకులు కల్వచర్ల కృష్ణవేణి, అయుత శివకుమార్, కుమ్మరి శ్రీనివాస్, కవితసరోజిని, మూల విజయారెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్, చెలకలపల్లి శ్రీనివాస్, మేతుకు దేవరాజ్, మారుతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment