ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
పెద్దపల్లిరూరల్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్‌గౌడ్ కోరారు. విద్యారంగంలో నెలకొన్ని సమస్యలు పరిష్కరించాలన్నారు. పలువురు నాయకులతో కలిసి ఆయన మంగళవారం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ వేణుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ నేత ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలోని కలెక్టరేట్ల ముట్టడిలో భాగంగా జిల్లా కేంద్రంలో ఆందోళన చేశామని అన్నారు. పెండింగ్‌లోని రెండేళ్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, కాలేజీ విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేల స్కాలర్‌షిప్ మంజూరు చేయాలని, విదేశీ విద్యకు రూ.20 లక్షల స్టైఫండ్ అ మలు చేయాలని ఆయన కోరారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల స్కాలర్‌షిప్ పెంచాలని, బీసీ స్టడీ సర్కిల్ బడ్జెట్‌ను రూ.200 కోట్లకు పెంచాలని, ప్రభుత్వమే అన్ని ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రాలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నం ప్రసాద్, సరోజ, బొద్దుల అరుణ, నోమురి శ్రీధర్, దొడ్డిపట్ల శైలజ, వనిత, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మనోజ్‌గౌడ్
అదనపు కలెక్టర్ వేణుకు వినతిపత్రం అందజేత
Comments
Please login to add a commentAdd a comment