శ్వాసకోస సమస్యలపై పరిశోధన
విటమిన్–డి, శ్వాసకోస సంబంధిత సమస్యలు, ప్రభావంపై హర్షవర్ధన్, సందీప్‌తో కలిసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అశోక్‌వర్ధన్ మా ర్గదర్శనంలో పరిశోధన చేశాం. జాతీయ, అంతర్జాతీయ పరిశోధకులు మా ప్రదర్శనలను ప్రత్యేకంగా అభినందించడం ఆనందంగా ఉంది. – సృజన, మెడికో
జ్ఞాపకశక్తిపై..
బయోకెమిస్ట్రీ జాతీయ సదస్సులో పాల్గొనడం గర్వంగా ఉంది. మమ్మల్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ అశోక్‌కుమార్ గైడ్ చేశారు. మెడికో సాల్వాజి రిషిరావుతో కలిసి న్యూరో బయోకెమెస్ట్రీలో మెదడు, దాని జ్ఞాపకశక్తి’పై చేసిన పరిశోధనను సదస్సులో ప్రదర్శించడం ఆనందంగా ఉంది. – గోషిక అన్షు, మెడికో
ఆనందంగా ఉంది
లెడ్ టాక్సిసిటీ, నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యల మెడికో తిరుషి, అభిరామ్‌తో కలిసి చేసిన పరిశోధన చేశాం. ప్రతులను సదస్సులో ప్రదర్శించాం. మా ప్రదర్శనపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మెడికోలు ఆసక్తిగా అడిగి తెలుసుకోవడం గర్వంగా ఉంది.
– సాత్విక్, మెడికో
తొలిసారి జాతీయస్థాయిలో
మా కాలేజీ ఎంబీబీఎస్ స్టూడెంట్ల పరిశోధనలు తొలిసారి జాతీయస్థాయిలో ప్రదర్శించిన తీరు వారి ప్రతిభకు అద్దంపడుతోంది. బయోకెమెస్ట్రీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ల కృషి ప్రశంసనీయం. ఇదే స్ఫూర్తితో పరిశోధనలను అంతర్జాతీయ సదస్సుల్లో ప్రదర్శించేలా కృషి చేస్తాం.
– హిమబింద్‌సింగ్, ప్రిన్సిపాల్, సిమ్స్ కాలేజీ
Comments
Please login to add a commentAdd a comment