మల్లికార్జునస్వామి శోభాయాత్ర
కమాన్‌పూర్(మంథని): జూలపల్లి గ్రామంలో ఆదివారం శ్రీపర్వతాల మల్లికార్జునస్వామి శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి విగ్రహా ప్రతిమలను పల్లకీలో ఊరేగించారు. ఒగ్గు కళాకారుల డోలు వాయిద్యాలు, మహిళల కోలాటాలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. గ్రామ శివారులోని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆలయ నిర్వాహకులు, ఎలబోయిన వంశీయులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి సదస్సులో ‘సిమ్స్’ మెడికోల ప్రతిభ
కోల్‌సిటీ(రామగుండం): చండీగఢ్‌లో ఈనెల 4 – 7వ తేదీ వరకు నిర్వహించిన 50వ జాతీయ బయోకెమిస్ట్రీ సదస్సులో సింగరేణి ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) కాలేజీకి సెకండియర్ మెడికోలు ప్రతిభ చాటారు. బయోకెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ వర్ధన్ ఆధ్వర్యంలో సల్వాజి రిషిరావు, హర్షవర్ధన్, సాత్విక్, అభిరామ్, సుదీప్, సృజన, అనూష, అన్షు న్యూరో బయోకెమిస్ట్రీ విటమిన్–డి, హెవీ మెంటల్ టాక్సిసిటీపై చేసిన పరిశోధనలను సదస్సులో ప్రదర్శించారు. వీరి ప్రదర్శనను వీక్షించిన జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, నిపుణులు విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రతిభ చాటడం కళాశాలకు గర్వకారణమని, ఇందుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అశోక్‌వర్ధన్‌ను సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబిందుసింగ్, ప్రొఫెసర్లు తదితరులు అభినందించారు.
సీఎంను కలిసిన అవినాష్
పెద్దపల్లిరూర ల్: ఇటీవల ని ర్వహించిన ఎ న్నికల్లో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా గె లిచిన బొంకూ రి అవినాష్ ఆ దివారం హైదారాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం ఆయనకు సూచించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అవినాష్ కృతజ్ఞతలు తెలిపారు.
మిఠాయిలు పంపిణీ
జూలపల్లి(పెద్దపల్లి): మండల కేంద్రానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ, న్యూజీలాండ్‌లో నివాసం ఉంటున్న పద్మశాలీ నాయకుడు కోడూరి చంద్రశేఖర్ అక్కడ నిర్వహించిన ఎన్నికల్లో తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికపై బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు సంపత్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో సంబురాలు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్య క్రమంలో బడుగు, బలహీన వర్గాల ఐక్య వేదిక నాయకుడు మానుమండ్ల శ్రీనివాస్, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు మేరుగు రమేశ్, నాయకులు ముమ్మాడి రవి, సతీశ్‌సింగ్, వేణు, అజయ్, తోట కూమార్, వెంకటేశ్, వోల్లాజీ శ్రీనివాస్, ముత్యాల కొమురయ్య, ప్రేమ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా పరీక్షలు
రామగిరి(పెద్దపల్లి): తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆధ్వర్యంలో స్థానిక సెంటినరీకాలనీ జేఎన్టీయూలో ఆదివారం డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించారు. ఉదయం జరిగిన పరీక్షలకు 140 మందికి 101 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 140 మందికి 112 మంది హాజరయ్యారని వివరించారు. రామగిరి ఎంపీడీవో శైలజారాణి ఆధ్వర్యంలో పన్నూర్ గ్రామ పంచాయతీ సిబ్బంది పరీక్ష కేంద్రం ఆవరణలో పారిశుధ్య పనులు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment