అభివృద్ధి పనులే ఆరోపణలకు సమాధానం
● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్
గోదావరిఖని/కోల్‌సిటీ(రామగుండం): నియోజకవర్గంలో తాము చేపట్టే అభివృద్ధి పనులే ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానమిస్తాయని రామగుండం ఎ మ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. స్థానిక ఇందిరానగర్‌లో టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.3.76 కోట్ల వ్యయంతో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన 900 మీటర్ల పొడవైన మేజర్ నాలా పనులను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. అప్పటి పాలకులు 25ఏళ్లుగా చేయలేని పనులను తాము గెలిచిన ఆర్నెల్లలోనే చేసి చూపించామన్నారు. ని యోజకవర్గంలో మార్పు మొదలైందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేక చెత్తాచెదారం కూరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని, దీనితో ప్రజలు ఇబ్బందికి గురయ్యేవారని తెలిపారు. రోడ్ల విస్తరణ, లైటింగ్, కమర్షియల్ కాంప్లెక్స్, అభివృద్ధి, సంక్షేమ పనుల కోసం రూ.500కోట్లు మంజూరు కాగా రూ.280కోట్లతో పనులు ప్రారంభమైయ్యాయని వివరించారు. నాయకులు మహంకాళి స్వామి, రాజిరెడ్డి, ముస్తాఫా, శ్రీనివాస్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment