పల్లెకు హైస్పీడ్ నెట్
ముత్తారం(మంథని): నగరాలు, పట్టణాలతో సమానంగా పల్లెల్లోనూ నాణ్యమైన, హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తేవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు టీ ఫైబర్ సేవలను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వర్చువల్ విధానంలో ఆదివారం ప్రారంభించారు. దీంతో అడవిశ్రీరాంపూర్‌వాసులకు నాణ్యమైన, వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. తొలుత ఇంటింటా మూడు నెలలపాటు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తారు.
పైలెట్ ప్రాజెక్టులుగా మూడు గ్రామాలు..
సంగారెడ్డి జిల్లా ఆంధోల్ మండలం సంగుపేట, నారాయణపేట జిల్లా మద్దూరు, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేశారు. ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ఆదివారం పర్చువల్ పద్ధతిన టీ ఫైబర్ సేవలు ప్రారంభించారు. కలెక్టరేట్‌లో ఈ దృశ్యాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ పలువురు అధికారులు తదితరులు వీక్షించారు. హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడంతో గ్రామస్తుల్లో సందండి నెలకొంది.
తొలుత తొమ్మిది ఇళ్లకు..
పయనీర్ ఈ ల్యాబ్స్ కంపెనీ ఆధ్వర్యంలో టీ పీవోసీ(ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్)లో భాగంగా అడవిశ్రీరాంపూర్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించారు. టీ ఫైబర్, పయనీర్ ఈ ల్యాబ్స్ కంపెనీ భా గస్వామ్యంతో ప్రభుత్వం ఇంటింటా క్వాలిటీ హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తోంది. ఈ గ్రామ జనాభా సుమారు 5వేలకుపైగా ఉంటుంది. 1,108 కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రామంలో తొ మ్మిది ఇళ్లకు టీ ఫైబర్ కేబుల్ కనెక్షన్ ఇచ్చారు.
టీ ఫైబర్ సేవలు ఇలా..
● 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్..
● ఇంటర్నెట్, ఐపీటీవీ, మొబైల్ ఫోన్‌నెట్
● సెట్‌ఆఫ్ బాక్స్‌తో టీవీని కంప్యూటర్‌లా వినియోగించే సౌకర్యం
● ప్రభుత్వ అప్లికేషన్ల సదుపాయం(పౌరసేవలు)
● గ్యాస్, కరెంట్ తదితర బిల్లుల చెల్లింపు
● టీ ఫైబర్ ద్వారా తక్కువ ధరకే క్వాలిటీ హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం
● విద్యార్థుల విద్య, ఉద్యోగ సాధనకు ఆన్‌లైన్ క్లాసులు
● గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు అవకాశం.
ఇంటింటికీ నాణ్యమైన ఇంటర్నెట్ సౌకర్యం
ఫైలెట్ ప్రాజెక్టుగా అడవిశ్రీరాంపూర్ ఎంపిక
టీ ఫైబర్ సేవలు ప్రారంభించిన మంత్రి
Comments
Please login to add a commentAdd a comment