ఖర్చు ఆదా అయితంది
నేను బీటెక్ పూర్తి చేసిన. ఏడాదిన్నరగా నాన్ ఐటీలో రోజూ ఐదు గంటల పాటు ల్యాప్‌టాప్‌పై వర్క్ చేస్తున్న. మా ఊరులో నెట్ సౌకర్యం లేదు. నెలకు రూ.1,000పైగా మొబైల్‌లో రిచార్జీ చేసుకునేవాడి. ఆర్థికంగా ఇబ్బందిగా ఉండేది. టీ ఫైబర్‌తో హైస్పీడ్ నెట్ వస్తోంది. ఖర్చు కూడా ఆదా అవుతంది.
– ఆపరాధి రాకేశ్, సాఫ్ట్‌వేర్, గ్రామస్తుడు
ఆనందంగా ఉంది
వరంగల్‌లో ఎంసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న. సెలవుల్లో ఇంటికి వచ్చిపోతూ ఉంట. నెట్ లేక ఇబ్బంది ఉండేది. ఇప్పుడు టీ ఫైబర్ కనెక్షన్ ఇవ్వడం ఆనందంగా ఉంది. దీంతో మా టీవీకి కనెక్షన్ ఇచ్చినం. ఉద్యోగాల కోసం రెజ్యూమ్, అప్లికేషన్ డౌన్ లోడ్, కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపరేషన్, మెయి ల్స్ తదితర సేవలు అందుబాటులోకి వచ్చినయి. మా ఊరులో పండుగ వాతావారణం ఏర్పడింది. – నిమ్మతి సౌమ్య, విద్యార్థిని
నెలరోజుల్లో ఇంటింటికీ కనెక్షన్
నెలరోజుల్లోగా అడవి శ్రీరాంపూర్‌లో ఇంటింటా ఇంటర్నెట్ కనెక్షన్లు అందిస్తాం. ఇందుకోసం ఏర్పాటు చేసే సెట్ ఆఫ్ బాక్స్ మల్లిపుల్ ఆప్షన్‌గా పనిచేస్తుంది. కంప్యూటర్ లేకున్నా టీవీని కూడా కంప్యూటర్‌లా ఉపయోగించవచ్చు.
– వర్ధినేని పవిత్రన్,
టెక్నాలజీ హెడ్, పయనీర్ ఈ ల్యాబ్స్
ప్రతీ గ్రామానికి నెట్ సేవలు
తక్కువ చార్జీకే పల్లెల్లో క్వాలిటీ హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. టీ ఫైబర్‌తో టీవీ, కంప్యూటర్, మొబైల్ ఫోన్ సేవలు పొందేవీలుంది. రాష్ట్రంలో మూడు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశాం. అందులో మంథని నియోజకవర్గంలో అడవిశ్రీరాంపూర్ ఉంది.
– శ్రీధర్‌బాబు, ఐటీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment