14న లోక్ అదాలత్
గోదావరిఖనిటౌన్: నగరంలో ఈనెల 14న చే పట్టే జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు అన్నారు. అదనపు జిల్లా న్యాయస్థానంలో సోమవారం లోక్ అదాలత్ సన్నాహక సదస్సు నిర్వహించారు. జడ్జి ముఖ్య అతిథిగా జడ్జి హాజరై మాట్లాడారు. రాజీమార్గమే రాచమార్గమన్నారు. లోక్ అదాలత్ ద్వారా వెలువడే తీర్పుల్లో అప్పీళ్లకు అవకాశం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నల్లాల వెంకట సచిన్‌రెడ్డి, రెండో అదనపు మెజిస్ట్రేట్ వెంకటేశ్ దుర్వ, గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీశ్, కోర్టు అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నహీద ఫర్హీన్, ఏసీపీ రమేశ్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్‌కుమార్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి ఈత పోటీలకు ఎంపిక
గోదావరిఖనిటౌన్: భూపాలపల్లిలోని సింగరే ణి స్విమ్మింగ్ పూల్‌లో ఇటీవల నిర్వహించిన 9 వ తెలంగాణ సౌత్‌జోన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ చాపియన్‌షిప్–2024 పోటీల్లో స్థానిక తిలక్‌నగర్‌కు చెందిన ఆర్.సత్యశ్రీ 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. సత్య శ్రీ ఈనెల 27న విజయవాడ గాంధీనగర్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఉమ్మడి జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు.
కరాటే పోటీల్లో ప్రతిభ
మంథని: హనుమకొండ కాకతీయ యూనివర్శిటీలో ఇటీవల జరిగిన అంతర్ రాష్ట్ర కరాటే పోటీల్లో మంథని జపాన్ సిటోరియో కరాటే విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. బంగారు, వెండి పతకాలు సాధించారు. ఈ విషయాన్ని ఇన్‌స్ట్రక్టర్ కావేటి సమ్మయ్య తెలిపారు. విద్యార్థులను పలువురు అభినందించారు.
జాతీయ స్థాయి టోర్నీకి ఎంపిక
రామగుండం: అంతర్గాం మండలం ఆకెనపల్లి గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు ఇటీవల మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయి టోర్నీకి ఎంపికయ్యారు. ఇందులో ఐ.ఉదయ్‌తేజ, ఐ.హర్షిత బంగారు పతకాలు సాధించారు. వీరిని జాతీయ కుంగ్‌ఫూ ఉత్తమ అవార్డు గ్రహీత సదానందం, మాస్టర్ రామ్‌లక్ష్మణ్ అభినందించారు.
మహిళలపై హింసను అరికట్టాలని వినతి
పెద్దపల్లిరూరల్: మహిళలపై హింసను అరికట్టాలని, పనిప్రదేశాల్లో వివక్ష నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందించారు. మహిళలు, బాలికలపై హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ జ్యోతి ఆందోళన వ్యక్తం చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా మహిళా కేసులు సత్వరమే పరిష్కరించి, దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. నాయకులు చుక్కమ్మ, పోచమ్మ, లత, లక్ష్మి, వనజారాణి, సుశీల, దేవమ్మ, రవీందర్, వెంకటస్వామి, సాగర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment