విద్య, వైద్యం హబ్‌గా జగిత్యాల
● ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి ● నియోజకవర్గానికి అత్యధిక నిధులు
● ఏడాదిలోనే ఎంతోచేశా ● అభివృద్ధి కోసమే పార్టీ మారాను
● ‘సాక్షి’తో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: ‘జగిత్యాలను విద్య, వైద్య హబ్‌గా తీర్చిదిద్దాం. వృత్తిరీత్యా డాక్టర్‌నైనా.. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. నియోజకవర్గ అభివృద్ధికి అత్యధిక నిధులు తెచ్చాను. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాల్లో పాలుపంచుకుంటూ ముందుకెళ్తున్నా. ప్రజలు నాకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా..’ అన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా చేసిన అభివృద్ధి, నాలుగేళ్లలో చేయాల్సిన ప్రగతిపై ‘సాక్షి’కి వివరించారు.
సాక్షి: ఎమ్మెల్యేగా ఏడాది పూర్తయింది. ఇప్పటివరకు ఏం చేశారు? ఇంకా ఏం చేయనున్నారు?
ఎమ్మెల్యే: జగిత్యాల నియోజకవర్గంలో రూ.240 కోట్లతో ఎస్సీ రెసిడెన్షియల్ కళాశాల, రూ.100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, బీర్‌పూర్‌లో కేజీబీవీ పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం. 4,520 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు దాదాపు పూర్తికావచ్చాయి. ఇప్పటికే కాంట్రాక్టర్లకు రూ.31 కోట్లు చెల్లించాం. పైప్‌లైన్, వాటర్‌ట్యాంక్‌కు రూ.34 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తాం. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల, 50 బెడ్లతో క్రిటికల్ కేర్ యూనిట్ పూర్తి కావస్తోంది. అన్ని పరీక్షలు ఉచితంగా చేసుకునేలా తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశాం. బీర్‌పూర్ మండలానికి కు పీహెచ్‌సీ మంజూరైంది. నియోజకవర్గం మొత్తంగా 21 పల్లె దవాఖానాలు మంజూరయ్యాయి. ఒక్కో భవనానికి రూ.20లక్షలు మంజూరు చేయించా. త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
Interview
Comments
Please login to add a commentAdd a comment