పరిశోధనకు ప్రశంస
● జాతీయస్థాయిలో ‘సిమ్స్’ మెడికోల ఖ్యాతి ● పీజీ, పీహెచ్‌డీ, శాస్త్రవేత్తల పరిశోధనలకు దీటుగా నిలిచిన వైనం ● దేశంలోనే తొలిసారి గోదావరిఖని మెడికల్ కాలేజీకి ప్రత్యేక గుర్తింపు ● అంతర్జాతీయ ప్రముఖులతో అభినందనలు అందుకున్న మెడికోలు
కోల్‌సిటీ(రామగుండం): బయో కెమిస్ట్రీ ఒక సంక్లిష్టమైన పాఠ్యాంశం. ఈ సబ్జెక్టును ఎంచుకున్న గోదావరిఖని సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్–ప్రభుత్వ) కళాశాల ద్వితీయ సంవ త్సరం విద్యార్థులు సృజన, ఆరుషి, అన్షు, హర్షవర్ధన్, సాత్విక్, అభిరామ్, సందీప్, రిషిరావ్ వివిధ అంశాలపై పరిశోధనలు చేశారు. ‘విటమిన్–డి, శ్వాసకోస సంబంధిత సమస్యలు –ప్రభావం’ , మెదడు – జ్ఞాపక శక్తి’, ‘లెడ్ టాక్సిసిటీ – నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యలు’పై అసిస్టెంట్ ప్రొఫెసర్ అశోక్ వర్ధన్ మార్గదర్శకత్వంలో వైద్య విద్యార్థులు చేసిన ఈ పరిశోధనలు జాతీయస్థాయిలో ప్రశంసల జల్లులు కురిపించాయి.
దేశవ్యాప్తంగా 1,200 మంది హాజరు
బయో కెమిస్ట్రీపై చండీగఢ్‌లో ఈనెల 4 – 7 వరకు జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. దేశంలోని పలు ప్రముఖ మెడికల్ కాలేజీల నుంచి సుమారు 1,200 మందికిపై పీజీ, పీహెచ్‌డీ కోర్సులు అభ్యసిస్తున్న మెడికోలతోపాటు పరిశోధకులూ హాజరయ్యారు. దేశ, విదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
దేశంలోనే తొలిసారి
ఇంటర్నేషన్ ఫెడరేషన్ ఆఫ్ క్లినికల్ కెమెస్ట్రీ(ఐఎఫ్‌సీసీ) సహకారంతో అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ బ యోకెమిస్ట్రీ ఆఫ్ ఇండియా(ఏసీబీ ఐకాన్–2024) ఏటా జాతీయ స్థాయి సదస్సులు నిర్వహిస్తోంది. వై ద్య పరిశోధలు చేసే మెడికోలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటివరకు 49 సదస్సులు జరగా.. పీజీ, పీహెచ్ డీలు చేసే మెడికోలు, శాస్త్రవేత్తల పరిశోధనలనే ఇందులో ప్రదర్శించడానికి అనుమతించేవారు. ఈసా రి ఎంబీబీఎస్ స్టూడెంట్లు చేసిన పరిశోధనలనూ ఎంపిక చేయడం, అందులో సిమ్స్ మెడికోలకు ప్రశంసలు లభించడం విశేషం. అంతర్జాయతీయ స్థాయిలోనూ పరిశోధనలు చేయాల్సిందిగా విదేశీ ప్రతినిధులు ఆహ్వానించడం విశేషం.
మూడు బృందాలు..
సిమ్స్‌లోని ఎనిమిది మంది మెడికోలు అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్గనిర్దేశనంలో మూడు బృందాలుగా ఏర్పడ్డారు. ‘విటమిన్–డి, శ్వాసకోస సంబంధిత సమస్యలు –ప్రభావం’, మొదడు – జ్ఞాపక శక్తి’, ‘లెడ్ టాక్సిసిటీ – నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యలు’పై పరిశోధనలు చేసి నివేదిక తయారు చేశారు. పరిశోధనల ద్వారా విద్యార్థుల్లో వైద్యచికిత్సలపై అవగాహన పెంపొందడంతోపాటు పేషెంట్లకు నాణ్యమైన వైద్యం అందించేందుకు మెడికోలు అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీజీ, పీహెచ్‌డీ, శాస్త్రవేత్తలకు ధీటుగా సిమ్స్ ఎంబీబీఎస్ స్టూడెంట్లు చేసిన పరిశోధనలు జాతీయస్థాయి సదస్సులో ప్రదర్శనకు ఎంపిక కావడం, దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రముఖలతో ప్రశంసలు అందుకోవడం సిమ్స్ పేరును జాతీయస్థాయిలోకి తీసుకెళ్లినట్లయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment