సమస్యలకు సత్వర పరిష్కారం
● అడిషనల్ కలెక్టర్ వేణు
పెద్దపల్లిరూరల్: ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాలని అడిషనల్ కలెక్టర్ వేణు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. వారినుంచి అదనపు కలెక్టర్ వేణు అర్జీలు స్వీకరించారు. అధికారులు సత్వరమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment