ధరణి సమస్యలు పరిష్కరించాలి
పెద్దపల్లిరూరల్: ధరణి పెండింగ్ దరఖాస్తులు, జాతీయ రహదారుల భూ సేకరణ చెల్లింపులపై కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ వేణుతో కలిసి సోమవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. ధరణి వెబ్‌సైట్‌లోని పెండింగ్ మ్యుటేషన్, పెండింగ్ సక్సెషన్ తదితర మాడ్యుల్స్‌ను ప్రభుత్వం కలెక్టర్ల నుంచి అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారులకు బదలాయించిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. వీటిని వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. మంచిర్యాల – వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో ఆర్బిట్రేషన్ రైతులకు వేగవంతంగా చెల్లింపులు చేయాలని కలెక్టర్ అన్నారు. పనులు త్వరగా గ్రౌండ్‌లా అధికారులు నేషనల్ హైవే అథారిటీకి పూర్తి సహకారం అందించాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య, సురేశ్, గోదావరిఖని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు, అసిస్టెంట్ డైరెక్టర్(సర్వే ల్యాండ్ రికార్డ్స్) శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment