‘రాజకీయాలకు తలొగ్గ వద్దు ’
ధర్మారం(ధర్మపురి): రాజకీయాలకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణ అనుమతులు జారీచేస్తే పంచాయతీ కార్యదర్శులే బాధ్యులవుతారని ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ హెచ్చరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యదర్శులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. అర్హులైన పేదకుటుంబాలను గుర్తించి తయారు చేసిన జాబితాను ఎంపీడీవోకు పంపించాలని ఆయన ఆదేశించారు. విమర్శలకు తావులేకుండా జాబితా ఉండాలని ఆయన అన్నారు. జాబితా వచ్చాక ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమీక్షించి అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, ఎంపీడీవో ప్రేమ్‌కుమార్, తహసీల్దార్ ఎండీ అరిఫ్, పంచాయతీరాజ్ డీఈఈ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతకు పరామర్శ
గోదావరిఖని: అనారోగ్యంతో హైదరాబాద్‌లో ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేశ్‌ను రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ మంగళవారం పరామర్శించారు. ఆయన ఆరో గ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. రాజేశ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే ఠాకూర్ సూచించారు.
హిందువులపై దాడులు ఆపాలి
జ్యోతినగర్(రామగుండం): బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలు, హిందువులపై దాడులను వెంటనే ఆపేయాలని హిందూ ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఎన్టీపీసీలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ, హిందువులు, స్వామీజీలు, ఆలయాలు, మహిళలపై దాడులు చేయడం సరికాదన్నారు. అనంతరం రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఎన్టీపీసీ యూత్, వ్యాపార, వర్తక, హిందూ సంఘాలు, అయ్య ప్ప సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యం
పెద్దపల్లిరూరల్: విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని ఏబీవీపీ కరీంనగర్ విభాగ్ కన్వీనర్ అజయ్ అన్నారు. ఏబీవీపీ రాష్ట్ర మహాసభల ప్రచార పోస్టర్‌ను స్థానిక ప్రైవేట్ కళాశాలలో మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు ఈనెల 23, 24, 25వ తేదీల్లో సిద్దిపేటలో ని ర్వహిస్తారన్నారు. సుమారు 1,500 మంది యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, ప్రొఫెస ర్లు, ప్రముఖులు తరలివస్తారని, విద్యారంగ సమస్యలపై చర్చిస్తారని ఆయన వివరించారు. మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు బండి రాజశేఖర్, అజయ్, సందీప్, అ రవింద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
గనులపై మల్టీ డిపార్ట్‌మెంట్ కమిటీ పర్యటన
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే–11గనిలో మంగళవారం మల్టీ డిపార్ట్‌మెంట్ కమిటీ పర్యటించింది. కార్పొరేట్ మల్టీ డిపార్ట్‌మెంట్ కమిటీ సంస్థ స్థితిగతులను ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ ద్వారా వివరించింది. గనిలో ఉత్పత్తి, యంత్రాలపై కార్మికులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, ఎస్‌వోటూ జీ ఎం గోపాల్‌సింగ్, బ్రాంచి సెక్రటరీ అరెల్లి పో శం, ఏరియా ఇంజినీర్ డీవీరావు, ఐఈడీ ఏజీ ఎం ఆంజనేయులు, ఏజెంట్ శ్రీనివాస్, డీజీ ఎం( పర్సనల్) కిరణ్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment