విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం అవసరం
ముత్తారం(మంథని): గ్రామీణ విద్యార్థుల్లో శాసీ్త్ర దృక్పథం అవసరమని, ఇందుకోసం మద్రాస్ ఐఐ టీ నిర్వాహకులు చొరవ తీసుకోవడం అభినందనీయమని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. ధర్యపూర్ మోడల్ స్కూల్‌లో మంగళవారం నిర్వహించి న ప్రీ కెరీర్ గైడన్స్, సైన్స్ ఎడ్యూకేషన్‌లో డీఈవో మాట్లాడారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు టెన్త్, ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సులో చదివితే భవిష్య త్ ఉంటుందనే సందేహాలను నివృత్తి చేశారు. ఐఐ టీ మద్రాస్ ప్రొఫెసర్ శ్రీనివాస చక్రవర్తి ఆశయ సాధన కోసం ఐఐటియున్ పింగిలి విక్రమ్‌కుమార్ అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. కేరీర్ గైడెన్స్ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. ఏఎంవో షేక్, ఎంఈవో ఓదెలు, ఎంపీడీవో సురేశ్, ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్ తోట శారద పాల్గొన్నారు.
క్రీడలపై ఇష్టం పెంచుకోవాలి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): విద్యార్థులు క్రీడలపై ఇష్టం పెంచుకుని, జాతీయ స్థాయిలో రాణించాలని డీఈవో మాధవి సూచించారు. స్థానిక జెడ్పీ హై స్కూల్‌లో నిర్వహించిన క్రీడాపోటీలను ఆమె ప్రా రంభించి మాట్లాడారు. తహసీల్దార్ ఎండీ వకీల్, ఎంపీడీవో రామ్మోహనాచారి, ఎంఈవో మహేశ్ మాట్లాడారు. హెచ్‌ఎంలు, పీఈటీలు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి
Comments
Please login to add a commentAdd a comment