ఫిక్స్‌డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలి
కరీంనగర్: ఆశవర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని ఆశవర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.జయలక్ష్మి, ఆర్.నీలాదేవి డిమాండ్ చేశారు. ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న సంఘం రాష్ట్ర కమిటీ బస్సు జాత మంగళవారం కరీంనగర్ చేరుకుంది. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు డప్పుచప్పుళ్లు, బతుకమ్మలు, బోనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట యూని యన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత మాట్లాడారు. ప్రతీ అంశంలో టార్గెట్స్ పెట్టి, ప్రభుత్వం ఆశవర్కర్లను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్, ఆశవర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి గంగమణి, ఉపాధ్యక్షురాలు ఆర్.సాధన, సహాయ కార్యదర్శి సునీత, జిల్లా అధ్యక్షురాలు రంగవేణి శారద, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment