జీవో నంబరు 22 అమలు చేయాలి
● అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్
గోదావరిఖని: పారిశ్రామిక ప్రాంతంలోని కాంట్రా క్టు కార్మికుల కోసం జీవో–22 అమలు చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ కోరారు. అసెంబ్లీ సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. రామగుండం నియోజకవర్గం పూర్తిగా కార్మిక ప్రాంతమన్నారు. ఇక్కడి సింగరేణి, ఎన్టీపీసీ, కేశోరాం సంస్థల్లో వేలాది మంది కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారికి సరైన వేతనాలు అందడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి.. కాంట్రాక్టు కార్మికుల కోసం జీవో నంబర్ 22 జారీచేశామన్నారు. దీనిని త్వరితగతిన అమలు చేసి కాంట్రాక్టు కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని తాము విన్నవించామని ఎమ్మెల్యే అన్నారు. దీంతో పాటుగా మున్సిపల్ కార్మికులకు సంబంధించిన వేతనాల గురించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పల్లెప్రాంత క్రీడాకారులను గుర్తించి జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూడా క్రీడాకారులను అన్ని రకాలుగా ప్రోత్సాహిస్తున్నారని ఠాకూర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment