గోదావరిఖని గాంధీచౌక్ చౌరస్తాలో పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులు
తలదాచుకునేందుకు ఆశ్రయ కేంద్రాలు కరువు
ఫుట్‌పాత్‌లు, బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్లే దిక్కు
చలితీవ్రతతో వణుకుతున్న వృద్ధులు, అనాథలు
విధి నిర్వహణలో పారిశుధ్య కార్మికులకూ తప్పని తిప్పలు
● నగరాల్లో లక్ష జనాభాకు ఒక నైట్‌షెల్టర్ (షెల్టర్ ఫర్ అర్బన్ హోం లెస్) ఉండాలి. రామగుండం జనాభా సుమారు 3లక్షలు. అక్కడ మూడు షెల్టర్లు ఉండాలి. కానీ, ఒక్కటే అందుబాటులో ఉంది. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథనిలో వాటి ఊసేలేదు. వివిధ పనులు, అవసరాల కోసం వచ్చిన వారు, రాత్రివేళల్లో రైలు, బస్సు ప్రయాణం చేసి వచ్చేవారు గమ్యస్థానాలకు చేరుకునే సౌకర్యాలు లేక ప్లాట్‌ఫామ్స్‌పైనే బిక్కుబిక్కుమంటున్నారు. చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు.
● ఈ వృద్ధురాలి పేరు పెద్దమ్మ. స్వగ్రామం జయ్యారం అని చెబుతోంది. గోదావరిఖని బస్టాండ్‌లో చలిలో గజగజ వణుకుతూ ఇలా కనిపించింది. పల్చటి చెద్దరు కప్పుకొని కనిపించింది. తన భర్త, ఇద్దరు కొడుకులు గతంలోనే చనిపోయారని, ఇంటి పైకప్పు రేకులను కోతులు పగులగొట్టాయని, అందుకే ఇక్కడ ఉంటున్నానని చెబుతోంది.
● గోదావరిఖని గాంధీచౌక్ చౌరస్తాలో పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులు వీరు. అర్ధరాత్రి ఎముకలు కొరికే చలిలో రోడ్లను ఇలా శుభ్రం చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి స్వెట్టర్లు, శాలువాలు, మంకీ క్యాపులు అందజేస్తే చలినుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.
● వీరు చిరువ్యాపారులు. సూర్యోదయానికి ముందే పెద్దపల్లి మార్కెట్‌లోకి కూరగాయలు సరఫరా చేయాలి. ఇందుకోసం వేకువజామున 2 గంటలకే మార్కెట్‌కు చేరుకోవాలి. చలిని సైతం లెక్కచేయకుండా మార్కెట్‌లో ఇలా పనులు చేస్తున్నారు.
సాక్షి, పెద్దపల్లి/కోల్‌సిటీ(రామగుండం): నగరవాసులు గాఢ నిద్రలో ఉంటే దిక్కుమొక్కులేని అభాగ్యులు చలికి గజగజ వణుకుతూ రోడ్ల వెంట, బస్టాండ్‌లలో, రైల్వేప్లాట్‌ఫారమ్‌లు, ఫుట్‌పా త్‌లపై తలదాచుకుంటున్నారు.
వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, ఫుట్‌పాత్, ఆలయ ఆవరణల్లో ఆశ్రయం పొందుతున్నవారు కప్పుకోవడానికి కనీసం దుప్పట్లు కూడా లేక నరకం అనుభవిస్తున్నారు.
సోమవారం అర్ధరాత్రి ‘సాక్షి’ జిల్లాలోని రామగుండం నగరం, పెద్దపల్లి జిల్లా కేంద్రం, మంథని, సుల్తానాబాద్ బల్దియాల్లో పర్యటించింది. పదుల సంఖ్యలో ని రాశ్రయులు చలి తీవ్రతతో కునుకు పట్టక, తలదాచుకునేందుకు వసతి లేక వణుకుతున్న దృశ్యా లు వెగులు చూశాయి. చిరువ్యాపారులు, మున్సిపల్ కార్మికులూ వణుకుతూనే తమ పనుల్లో నిమగ్నమై కనిపించారు.
కేంద్రాల ఏర్పాటుపై నిర్లక్ష్యం
బతుకు దెరువు కోసం వచ్చేవారు కొందరు.. ఆ ధారం లేక బతుకు దుర్భరమైన వారు మరికొందరు.. వైద్యం కోసం వచ్చే ఇంకొందరు.. అలనా పాలనా లేనిపండుటాకులు.. ఇంట్లోంచి నెట్టి వేయబడిన తల్లిదండ్రులు.. యాచనతో బతుకు నెట్టుకొచ్చే వారు.. గూడు లేకదిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడే అభాగ్యులు.. ఇలా ఎందరెందరో బల్దియాల్లో చీకటిరోజులు గడుపుతున్నారు.
వీరందరికీ షెల్టర్ ఫర్ అర్బన్ హోంలెస్ ద్వారా నీ డకల్పించాల్సిన బాధ్యత ఉన్నా అధికారులు ఆ విషయాన్ని విస్మరించడంపై విమర్శలు వస్తున్నా యి. రామగుండం నగరంపాటు పెద్దపల్లి, సు ల్తానాబాద్, మంథని బల్దియాల్లోని మెప్మా అధికారులు ఈ బాధ్యతలు విస్మరిస్తున్నారు.
తూతూ మంత్రంగా సర్వేలు..
● గోదావరిఖని బస్టాండ్, రామగుండం రైల్వేస్టేషన్ వద్ద ఒక్కో నైట్‌షెల్టర్ ఉంది. అధికారుల పర్యవేక్షణలోపంతో రామగుండంలోని నైట్‌షెల్టర్ నిరుపయోగంగా మారింది. గోదావరిఖని ఆశ్రయంలో సౌకర్యాలు అంతంతే ఉన్నాయి. నిరాశ్రయుల గుర్తింపుకోసం చేసే సర్వేలు తూతూమంత్రంగానే మారుతున్నాయి. ఒక్కో నైట్‌షెల్టర్‌లో 50 మంది వరకు ఆశ్రయం పొందే వీలుంది. ఇందులో 10 మందికి భోజనం పెడతారు.
జిల్లాలో మంగళవారం నమోదైన కనిష్ట ఉష్ణోగత్రలు(డిగ్రీల సెల్సియస్‌లో)
ధర్మారం 9.7
ఓదెల 9.7
రామగుండం 10.4
సుల్తానాబాద్ 10.5
అంతర్గాం 10.6
కమాన్‌పూర్ 10.6
మంథని 11.0
పాలకుర్తి 11.1
పెద్దపల్లి 11.4
ఎలిగేడు 11.5
జూలపల్లి 11.7
రామగిరి 11.9
Comments
Please login to add a commentAdd a comment