మరింత మెరుగ్గా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ
● నిర్వహణ తీరు మారకుంటే చర్యలు తప్పవు ● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు మరింత మెరుగ్గా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో మహిళా, శిశు, ది వ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులతో వివిధ అంశాలపై మంగళవారం కలెక్టర్ సమీక్షించారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, వాటి సేవలు, లబ్ధిదారుల వివరాలు, ప్రీ స్కూల్ నిర్వహణ, ఎనీమియా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు యూనిఫామ్స్ లేవని, టీచర్లు సమయపాలన పా టించడం లేదని, అపరిశుభ్రత తాండవిస్తోందన్నా రు. తక్షణమే మార్పు రావాలని సూపర్‌వైజర్లకు సూచించారు. ఏమాత్రం తేడా వచ్చినా టీచర్ల నుంచి సూపర్‌వైజర్, సీడీపీవో వరకు బాధ్యులవుతార ని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణులకు పౌష్టికాహారం, ఐరన్ మాత్రలు సకాలంలో అందించాలని, గర్భిణుల ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్, చెక్ ప్ సకాలంలో పూర్తిచేయాలని సూచించారు. ప్రీ స్కూళ్లలో పిల్లల హాజరు శాతం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వచ్చే సంక్రాంతి పండుగ నాటికి జిల్లాలో అనాథ శరణాయాలు, పిల్లల సమగ్ర వివరాలను సేకరించి తనకు నివేదించాలని అన్నారు. ఆర్‌బీఎస్‌కే వైద్యులు అందిస్తున్న సేవలు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారి వివరాలను తన దృష్టికి తీసుకుని రావాలని కలెక్టర్ పేర్కొన్నారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.
సఖి కేంద్రం సందర్శన..
రంగంపల్లిలో నిర్మిస్తున్న సఖి కేంద్ర భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహరర్ష సందర్శించారు. పెండింగ్ ప నులు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. కొత్త సంవత్సరంలో భవనం ప్రారంభించేలా చర్యలు తీ సుకోవాలని పంచాయతీరాజ్ ఈఈని ఆదేశించా రు. అనంతరం ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యతపై ఆరా తీశారు. సుల్తానాబాద్‌లోని వృద్ధాశ్రమం, బాల సద నం భవన పనులు పరిశీలించారు. పంచాయతీరాజ్ ఈఈ గిరీశ్‌బాబు, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్‌రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
17జీడికె76: మాట్లాడుతున్న కలెక్టర్ కోయ శ్రీ హర్ష
17జీడికె77:సఖీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ప్రజలకు చేరువయ్యేలా ఉండాలి
ప్రజలకు చేరువయ్యేలా వైద్య, ఆరోగ్య శాఖ ప నితీరు మరింత మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై ఆయన సమీక్షించా రు. కంటిశస్త్ర చికిత్సలు, డెంటల్, ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ, సైకాలజీ, డయాగ్నొస్టిక్ హబ్ తదితర సేవలను పేషెంట్లు వినియోగించేలా చూడాలని అన్నారు. క్షయ నియంత్రణకు జిల్లా లో 100 రోజులపాటు చేపట్టిన నిక్షయ శిబిరం ద్వారా సత్ఫలితాలు సాధించాలని సూచించా రు. గర్భిణులకు 102 వాహన సేవలు పక్కాగా ఉండాలన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధి కారి అన్న ప్రసన్నకుమారి, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్, సంక్షేమ అధికారి వేణుగోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment