టీబీ రహిత సమాజం నిర్మిద్దాం
● డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి డాక్టర్ విష్ణు ● రాగినేడు పీహెచ్‌సీలో సర్వే
పెద్దపల్లిరూరల్: క్షయ రహిత సమాజ నిర్మాణా నికి ప్రజలు అందరూ తమ బాధ్యతగా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధి డాక్టర్ విష్ణు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిక్షయ్ శిబిర్– 100 రో జుల కార్యక్రమంలో భాగంగా రాగినేడు ప్రాథమి క ఆరోగ్య కేంద్రం పరిధిలోని మేరపల్లిలో మంగళవారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విష్ణు మాట్లాడారు. దేశంలో క్షయను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు కేంద్రప్రభుత్వం తె లంగాణలోని 9 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందన్నారు. దీనిద్వారా నిక్షయ్ శిబిర్ – 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలోని మేరపల్లిలో అనుమానితులను పరీక్షించామని తెలిపారు. క్షయ లక్షణాలు బయటపడితే వాహనాల్లో అనుమానితులను నేరుగా ఆస్పత్రికి తరలించి మరిన్ని వైద్యపరీక్షలు చేస్తామని వివరించారు. ఆ తర్వాత అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారి కేవీ సుధాకర్‌రెడ్డి, మెడికల్ ఆఫీసర్ శ్రావణ్ కు మార్, టీబీ యూనిట్ సీనియర్ చికిత్స పర్యవేక్షకుడు డి.తిరుపతి, ఎంఎల్‌హెచ్‌పీ సౌమ్య, లక్ష్మి, జ్యోత్స్న, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
నిక్షయ్ శిబిరం సందర్శన
పాలకుర్తి(రామగుండం): రాణాపూర్‌లో చేపట్టిన నిక్షయ్ శిబిరాన్ని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు విష్ణు, బ్లెస్సీ సందర్శించారు. క్షయ నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment