‘విండో’లో అవినీతిపై విచారణ
సుల్తానాబాద్‌రూరల్: గర్రెపల్లి ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘంలో జరిగిన అవినీ తిపై మంగళవారం విచారణ జరిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీసీవో కార్యాలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు ఈ విచారణ చేపట్టా రు. సంఘం నూతన భవనానికి అవసరమై భూమి కొనుగోలు విషయంలో సింగిల్‌విండో పాలకవర్గం అవినీతికి పాల్పడగా, భూమి విక్రయించిన వ్యక్తిని బెదిరించినట్లు అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ విషయంలో సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు.. రికార్డులను పరిశీలించారు. భూమి విక్రయించిన సందెవేని శ్రీనివాస్ నుంచి కూడా వివరాలను సేకరించారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనన్నుట్లు సూపరింటెండెంట్ తెలిపారు.
19న ప్రజాభిప్రాయ సేకరణ
జ్యోతినగర్(రామగుండం): రామగుండం ఎ న్టీపీసీలో స్థాపించబోయే 2,600 మెగావాట్ల సా మర్థ్యంగల తెలంగాణ స్టేజీ–2 రెండోదశ సూ పర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుపై ఈనెల 19న ప్ర జాభిప్రాయ సేకరణ చేపడతామని అధికారు లు మంగళవారం తెలిపారు. ఎన్టీపీసీ సహకా రంతో పర్యావరణ విభాగం అధికారులు ఈమేరకు విస్త్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లోని జెడ్పీ హైస్కూల్ క్రీడా మై దానంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment