నేడు వినతుల స్వీకరణ
పెద్దపల్లిరూరల్: వర్గీకరణపై బుధవారం ఎస్సీ కమిషన్ వినతులు స్వీకరిస్తుందని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి నాగలైశ్వర్ మంగళవారం తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వ రకు కమిషన్ వినతులు స్వీకరిస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకస భ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, కమిషన్ చై ర్మన్ జస్టిస్ షమీం అక్బర్.. షెడ్యూల్డ్ కులాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారన్నా రు. ఎస్సీ వర్గీకరణపై జరిగే బహిరంగ విచారణకూ ఆసక్తిగలవారు హాజరై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలని సూచించారు.
జనారణ్యంలోకి నెమలి
జూలపల్లి(పెద్దపల్లి): కుమ్మరికుంటలోని వ్యవసాయ పొలాల్లో మంగళవారం ఉదయం నె మ లి ప్రత్యక్షమైంది. తీవ్ర అస్వస్థతతో కనిపించిన జాతీయ పక్షి నెమలిని గమనించిన రైతులు పొన్నం వెంకటేశ్, ఎర్రం జగన్ దానిని పెద్దపల్లి బీట్ అఫీసర్ రాంమూర్తికి అప్పగించారు. చికిత్స తర్వాత అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అటవీ అధికారులు తెలిపారు.
కుట్టు మెషన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
జ్యోతినగర్(రామగుండం): జిల్లాలోని మైనారిటీ మహిళలు ఉచిత కుట్టు మిషన్ల కోసం ఈనెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాల ని మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా ఇన్‌చార్జి అధి కారి రంగారెడ్డి మంగళవారం తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ మతాలకు చెందిన మహిళలు అర్హులన్నారు. ఆసక్తిగలవారు tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని, హార్డ్‌కాపీలను పెద్దపల్లిలోని తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. తెల్లరేషన్, ఆ హారభద్రత కార్డు కలిగి గ్రామీణంలో రూ. 1.50లక్ష లు, పట్టణాల్లో రూ.2 లక్షల వార్షికాదాయం ఉండి, 18 – 55 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు, కనీస విద్యార్హత ఐదో తరగతి చదివినవారు అర్హులని ఆయన వివరించారు.
నేడు క్రాస్‌కంట్రీ పోటీలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కార్యదర్శి గట్టయ్య తెలిపారు. 16, 18, 20 ఏళ్ల బాల, బాలికలు అర్హులన్నారు. పోటీల్లో ఎంపికై న వారు ఈనెల 22న నాగర్‌కర్నూల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారన్నారు. ఆసక్తి గలవారు ఎస్సెస్సీ మెమోతో రావాలని, వివరాలకు పీడీ ప్రణవ్, సెల్ : 96183 36976 నంబరులో సంప్రదించాలని వారు సూచించారు.
రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపిక
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): గర్రెపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు కవిత మంగళవారం తెలిపారు. బా లికల విభాగంలో టి.అక్షిత, డి.ప్రణవి, జి.శశిప్రియా, బాలుర విభాగంలో ఆదిత్య, వీరబ్ర హ్మం, పి.ఆదిత్య, రాకేశ్, రావణ్‌బహుళ, ధను శ్ ప్రతిభ చూపారని, వీరు ఈనెల 28 నుంచి హైదారాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారని హెచ్‌ఎం వివరించారు.
ముందస్తు క్రిస్మస్ వేడుకలు
గోదావరిఖనిటౌన్: స్థానిక సాక్రెడ్ హార్ట్ హైస్కూల్‌లో మంగళవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగరేణి ఆర్జీ–1 జనరల్ మేనేజర్ లలిత్‌కుమార్ కేక్‌ను కట్ చేసి చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం తబిత, ఈశ్వర కృప ఆశ్రమాల్లో దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగరేణి డిప్యూటీ జీఎం కిరణ్‌బాబు, పాఠశాల కరస్పాండెంట్ మరియ గోరేటి, ప్రిన్సిపాల్ ఆరోగ్యమేరీ, టికలా, ఎన్‌సీసీ ఫస్ట్ ఆఫీసర్ జ్యోత్స్న, ఉపాధ్యాయులు విజయ, పద్మజ, ఉష, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment