‘రుణమాఫీ పేరిట బీఆర్‌ఎస్ మోసం’
గోదావరిఖని: రుణమాఫీ పేరిట గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం షాదీముబారక్, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.9.10 లక్షల విలువైన చెక్కులు ఆయన అందించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 70 శాతానికిపైగా రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో అంతర్గాం తహసీల్దార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
‘అటల్’ రాజనీతిజ్ఞుడు
జ్యోతినగర్(రామగుండం): సుపరిపాలన అందించిన రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయ్ అని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గాండ్ల ధర్మపురి అన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు మిట్టపల్లి సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లో బుధవరాం అటల్‌బిహారీ వాజ్‌పేయ్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ధర్మపురి మాట్లాడారు. గ్రామీణ సడక్ యోజన, సర్వ శిక్ష అభియాన్, ఫోఖ్రాన్ పరీక్షలతో భారత్‌ను విశ్వవేదికపై ఒకశక్తిగా నిలిపిన వ్యక్తి అటల్‌బిహారీ వాజ్‌పేయ్ అని అన్నారు. నాయకులు మేడి తిరుపతి, సత్యనారాయణ, నర్సింగ్, సిలివేరి ఆంజనేయులు, ఈదునూరి చిరంజీవి, గొర్రె రాజు, దామరకుంట గణేశ్, పల్లికొండ రమేశ్, ఉప్పలంచ శ్రీనివాస్, తోట రవి పాల్గొన్నారు.
కళాకారుడికి సన్మానం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): జానపద కళాకారుడిగా విశిష్ట సేవలు అందించినందుకు జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు అంబాల రాజేందర్‌ను పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. తెలంగాణ జానపద కాళాకారుల సంఘం ఆధ్వర్యంలో సారిపల్లి కలొండలరావు ఫౌండేషన్ తరఫున తెలంగాణ సాంస్కృతిక శాఖ సారఽథి గద్దర్ వెన్నెలమ్మ, సాంస్కృతిక మాజీ సలహాదారు కేవీ రమాణాచారి బుధవారం హైదారాబాద్‌లో ఆయన కు పురస్కారం అందించి సన్మానించారు.
సమస్యలు పరిష్కరించాలి
పెద్దపల్లిరూరల్: సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని 16రోజులుగా సమ్మె చేస్తున్నా పాలకులు నిర్లక్ష్యం చేయడం సరికాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్ష శిబిరాన్ని బుధవారం వారు సందర్శించారు. తొలుత క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథరావు మాట్లాడుతూ, సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలన్నారు. నాయకులు రఘువీర్‌సింగ్, తిరుపతి, సంధ్యారాణి, రాజ్‌కుమార్, శ్రీనివాస్, స్వప్న, విజయలక్ష్మి, మంజుల, కల్పన, సతీశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి డీఆర్డీవోగా కాళిందిని
పెద్దపల్లిరూరల్: జి ల్లా గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్డీవో) అధికారిగా కాళిందినిదేవి బుధవా రం బాధ్యతలు స్వీ కరించారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించిన కాళిందినిదేవిని పెద్దపల్లి డీఆర్డీవోగా డెప్యూటేషన్‌పై బదిలీ చేశారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన డీఆర్డీవో రవీందర్ రాథోడ్‌ను ఆదిలాబాద్ డీఆర్డీవోగా బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment