క్రీస్తు దీవెనలు అందరిపై ఉండాలి
మహా పడిపూజ
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయంలో బుధవారం మహాపడి పూజ వైభవంగా జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయ్యస్వామి మాలలు ధరించిన భక్తులు ప్రత్యేకపూజలు చేశారు. ఆలయాన్ని రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించారు.
మంథని: ఏసుక్రీస్తు చల్లని దీవెనలు అందరిపై ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు. క్రిస్మస్ సందర్భంగా డివిజన్‌లో బుధవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంథని ఎరుకలగూడెం బేతేలు గాస్పె ల్ ప్రేయర్ మినిస్ట్రీస్, శ్రీపాదకాలనీ సియోను ప్రా ర్థనా మందిరంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు. కేక్ కట్ చేసి మిఠాయి లు పంపిణీ చేశారు. క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనా మందిరాల నిర్మాణానికి తాము అధికారంలో ఉండగా సరిపడా నిధులు మంజూరు చేశామని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుత సమయంలోనూ అవసరమైన మేర నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం త్వరలో ప్రారంభించబోతుందని తెలిపారు. అర్హులైన క్రైస్తవ కుటుంబాలకు కూడా అందులో అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, నాయకులు శశిభూషణ్ కాచే, మంథని సత్యం, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతకు పరామర్శ
రామగిరి(మంథని): నాగెపల్లి గ్రామానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్‌ను మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శించారు. తిరుపతి యాదవ్ ఇటీవల కంటి ఆపరేషన్ చేసుకుని ఇంటికి వచ్చారు. దీంతో మంత్రి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రోడ్డ బాపన్న, చిందం మహేశ్, బండారి సదానందం, ఓర్రె సదయ్య, ముచ్చకుర్తి శ్రీనివాస్, బంక్ మల్లేశ్ పాల్గొన్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment