మార్కెట్‌లో తెగిన చేయి కలకలం
రామగుండం: పట్టణంలోని సండే మార్కెట్‌లో బుధవారం తెగిపడిన కుడిచేయి భాగం కలకలం రేపింది. స్థానిక కార్పొరేటర్ భర్త సలీంబేగ్ సమాచారంతో సివిల్, ప్రభుత్వ రైల్వే ఔట్‌పోస్టు ఇన్‌చార్జి తిరుపతి విచారణ చేపట్టారు. తిరుపతి కథనం ప్రకారం.. స్థానిక కబ్రస్తాన్ రైల్వేట్రాక్ సమీపంలో ఓ వ్యక్తి కుడిచేతి తెగి అచేతనంగా పడిపోయాడు. స్థానికులు వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. వయసు 50–60 మధ్య ఉంటుంది. దంతాలు ఊడిపోయి. తన పేరు మల్లేశం అని, కల్వల అని పొంతనలేని సమాధానం చెప్తున్నాడు. బాధితుడి వివరాలు తెలియరావడంలేదు. యాచకుడిగా భావిస్తున్నారు. సంబంధీకులు ఉంటే 99493 04574 నంబరుకు ఫోన్‌చేసి తమను సంప్రదించాని రామగుండం జీఆర్పీ ఔట్ పోస్టు ఇన్‌చార్జి తిరుపతి తెలిపారు. చేయి భాగాన్ని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య సిబ్బంది ఖననం చేశారు. కేసు నమోదు చేశామని జీఆర్పీ పోలీసులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment