ఆస్తులు కాజేశారు.. అంత్యక్రియలు మరిచారు
జగిత్యాలక్రైం: ఆమెకు కన్నబిడ్డలు లేరు. బంధువులు అన్ని చూసుకుంటారని భావించిన ఆమె ఆస్తులు పంచించింది. కానీ.. ఆమె ఆస్తులు తీసుకుని.. తీరా ఆమె చనిపోతే కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా నిరాకరించారు. ఈ అమానవీయ ఘటన జిల్లాకేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఆమె మృతదేహాన్ని సుమారు ఆరు గంటల పాటు అంబులెన్స్‌లోనే ఉంచారు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని తీన్‌ఖని చౌరస్తా ప్రాంతానికి చెందిన సాదుల సత్తమ్మ భర్త 20 ఏళ్ల క్రితం మృతిచెందాడు. వీరికి పిల్లలు లేకపోవడంతో తమ ఆస్తిని బంధువులకు అప్పగించింది సత్తమ్మ. వృద్ధాప్యంతో మంగళవారం ఆమె ఆస్పత్రిలో చనిపోయింది. దీంతో బంధువులు అంబులెన్స్‌లో శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఆస్తి తీసుకున్న వారు శవాన్ని ఇంట్లోకి నిరాకరించడంతో రాత్రి 11 గంటల వరకు మృతదేహం అంబులెన్స్‌లో రహదారిపైనే ఉంది. పట్టణ ఎస్సై గీత జోక్యం చేసుకుని వృద్ధురాలి ఇంటి తాళాలు పగులగొట్టి మృతదేహాన్ని అందులో ఉంచారు. అయితే బుధవారం కూడా ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులెవరూ రాకపోవడంతో స్థానికులే అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె ఆస్తులు పంచుకున్నవారు మాత్రం అంత్యక్రియలకు రాకపోవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
అంతిమసంస్కారాలు చేసిన స్థానికులు
Comments
Please login to add a commentAdd a comment