ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు..
మంథని: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్న కొందరు పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలని, లేనిపక్షంలో పోలీస్‌స్టేషన్‌కు కాంగ్రెస్ పార్టీ బోర్డులు ఏర్పాటు చేయాల్సి వస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు హెచ్చరించారు. పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రామగుండం, మంచిర్యాల ఏసీపీలు పోలీస్‌శాఖకే మచ్చ తెచ్చారని, ఓ కాంగ్రెస్ నాయకుడి ఇంటికి వెళ్లి శాలువాలు కప్పించుకున్నారని ఆరోపించారు. ఆ ఏసీపీలు పోలీస్ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు సూచించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని, ఇలాగే బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పనిచేస్తున్న వారిపై కేసులు నమోదుచేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. రామగిరి మండలానికి చెందిన పూదరి సత్యనారాయణగౌడ్‌పై గత ఆర్నెల్లో 9 కేసులు నమోదు చేశారని, అందులో 4 కేసులు ఒక్కరోజే పెట్టారన్నారు. ఒకే అంశంపై ఒకవ్యక్తిపై నాలుగు కేసులు నమోదు చేశారని, ఇలా కేసులు నమోదు చేయొద్దనే నిబంధనలు ఉన్నా మంచిర్యాల, రామగుండం ఏసీపీలు బేఖాతరు చేశారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ తన చేతిలో పట్టుకుని తిరుగుతున్నారని, కా నీ, మంథనిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నా రని ఆయన విమర్శించారు. ఏసీపీల తీరుపై డీజీపీతోపాటు సీఎం, గవర్నర్, చీఫ్ జస్టిస్‌కు దర ఖాస్తు చేస్తామని, అలాగే అన్ని వేదికలను ఆశ్రయిస్తామని ఆయన అన్నారు. నాయకులు ఏగోళ పు శంకర్‌గౌడ్, తరగం శంకర్‌లాల్, పూదరి సత్యనారాయణగౌడ్, మాచిడి రాజుగౌడ్, కిషన్‌రెడ్డి, రాజిరెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
Comments
Please login to add a commentAdd a comment