కవి రాకుమారకు పురస్కారం
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనికి చెంది న ప్రముఖ కవి, రచయిత రాకుమార శుక్రవారం ఉత్తమ కవి ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ సంస్థ హుస్నాబాద్‌లో ఉత్తమ కళాకారులు, ఉద్యమకారులకు పురస్కారాలు అందజేసింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కళాకారులు, కవులు, ఉద్యమకారులు హాజరయ్యారు. ఇందులో సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని కవితలు, రచనలు చేస్తున్న రాకుమారకు ప్రతిభా పురస్కారం అందజేశారు. రాకుమార గతంలో అనేక అవార్డులు అందుకున్నారు. ఆయనను పలువురు కవులు, కళాకారులు, రచయితలు అభినందించారు.
‘ఎంపీకి నైతిక హక్కు లేదు’
పెద్దపల్లిరూరల్: పే ద దళితులను అడ్డుపెట్టుకుని కేంద్రమా జీ మంత్రి వెంకటస్వామి కూడబెట్టిన ఆస్తులను కాపాడుకునేందుకు పూటకో పార్టీ మార్చిన ఎమ్మె ల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణకు ఎమ్మార్పీఎస్ నేతలను విమర్శించే నైతికహక్కు లేదని బీజేపీ దళితమోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి పల్లె సదానందం మండిపడ్డారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాదిగ రిజర్వేషన్లను అడ్డుకుంటామంటూ ఎంపీ వంశీకృష్ణ మాట్లాడడం శోచనీయమన్నారు. అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్ల ఫలాలను పెత్తందారీలైన వివేక్ కుటుంబానికే పరిమితం చేసుకున్నారని దుయ్యబట్టారు. ఇకనైనా తన పద్ధతులు మార్చుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
‘అడ్రియాల గనికి బంగారు భవిష్యత్’
రామగిరి(మంథని): దేశంలోనే అతిపెద్ద భూ గర్భ బొగ్గు గని అడ్రియాలకు బంగారు భవిష్యత్ ఉందని కోల్‌ఇండియా సాంకేతిక సలహాదారు బి.వీరారెడ్డి అన్నారు. ఏపీఏ గనిలో శుక్ర వారం ఆయన దిగారు. పనిస్థలాలను పరిశీలించారు. అనంతరం గనిపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరారెడ్డి మాట్లాడారు. ఓసీపీల్లో బొ గ్గు నిక్షేపాలు కరిగిపోతున్నాయని, ప్రత్యామ్నాయంగా భూగర్భ గనులపై దృష్టి సారించాలని సూచించారు. 600 మీటర్ల లోతు నుంచి 800 మీటర్ల లోతు వరకు బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అడ్రియాల లాంటి లాంగ్‌వాల్ సాంకేతికత వి నియోగించే గనులు అవసరమని వెల్లడించా రు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధికారులు, సూపర్‌వైజర్లు, కార్మికులు సమన్వయంతో బొ గ్గు ఉత్పత్తి సాధించడం వారి పట్టుదలకు నిదర్శనమని ప్రశంసించారు. ఉద్యోగులకు కష్టాలు తగ్గాలన్న ఉద్దేశంతో మ్యాన్ వైండింగ్ ఎయిర్ షాఫ్ట్‌ను నిర్మించనున్నామని చెప్పారు. ప్రాజెక్టు అధికారి నాగేశ్వరరావు, ఏరియా ఇంజినీర్ కె. యాదయ్య, మేనేజర్ జనార్దన్, ప్రాజెక్టు ఇంజినీర్ రఘురాం పాల్గొన్నారు. కాగా, అడ్రియాల గని నిర్మాణంలో ప్రముఖపాత్ర పోషించిన వీ రారెడ్డిని జీఎం వెంకటేశ్వర్లు, ఐఎన్‌టీయూ సీ, ఏఐటీయూసీ నాయకులు రవీందర్‌రెడ్డి, కొమురయ్య తదితరులు ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment