మన్మోహన్‌సింగ్ సేవలు చిరస్మరణీయం
గోదావరిఖని: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ శుక్రవారం ఘనంగా నివాళి అర్పించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, పాతిపెల్లి ఎల్లయ్య, కొలిపాక సుజాత తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న స్థానికులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి నేరుగా వచ్చి తనకు వివరించాలని సూచించారు. వ్యక్తిగత సమస్యలే కాకుండా ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే విషయాలపైనా తనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు.
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు
ఎలిగేడు(పెద్దపల్లి): దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆద్యుడు మాజీప్రధాని మన్మోహన్‌సింగ్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. స్వగ్రామం శివుపల్లిలోని తన నివాసంలో శుక్రవారం మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆర్థిక శాస్త్రవేత్తగా జీవితం ప్రారంభించిన మన్మోహన్‌సింగ్.. ప్రధానిగా ఎదిగారని కొనియాడారు. పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, చింతకుంట విజయరమణారావు
మాజీ ప్రధానికి ఘనంగా నివాళి
Comments
Please login to add a commentAdd a comment