మాఫీ కోసం ఎదురుచూపు
సాక్షి, పెద్దపల్లి: నాలుగో విడత రుణమాఫీ కోసం జిల్లా రైతులు ఎంతోఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. చివరిసారిగా గత ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ సొమ్ము రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా నాలుగో విడత రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ శాఖ నుంచి లబ్ధిదారుల జాబితా, అవసరమైన నిధుల నివేదికను ఉన్నతాధికారులు ప్రభుత్వానికి గతంలోనే అందజేశారు. దీంతో వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న లోన్.. ఆలస్యమైనా మాఫీ అవుతుందని పలువురు రైతులు సంతోషపడ్డారు. రెండుమూడ్రోజుల్లో తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయని అన్నదాతలు ఆశించారు. నేటికీ వారి ఆశ నెరవేరలేదు.
మూడు విడతల్లో రూ.379.52 కోట్లు మాఫీ
జిల్లావ్యాప్తంగా మూడు విడతల్లో 51,827 మంది రైతులకు రూ.379.52 కోట్ల రుణమాఫీ చేశారు. కొందరికి ఇంకా మాఫీ కాలేదు. దీంతో కుటుంబ నిర్ధారణ బాధ్యతలను వ్యవసాయశాఖ అధికారుల కు ప్రభుత్వం అప్పగించింది. ఆ శాఖ అధికారులు క్లస్టర్ల వారీగా రైతుల వివరాలతో ప్రత్యేకంగా జాబితా రూపొందించి యాప్‌లో నమోదు చేశారు. రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతోపాటు రేషన్‌కార్డు లేకపోవడం, పేర్లు, ఆధార్ నంబ ర్లు, పట్టాదార్ పాస్ పుస్తకాల నంబర్ల నమోదులో తప్పిదాలు తదితర సమస్యలతో కూడిన వివరాలు వంటివి బ్యాంక్లరకు అప్పగించి ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన గ్రీవెన్స్‌లో నమోదు చేశారు. వీటికితోడు రూ.2లక్షలకుపైగా ఉన్న మొత్తాన్ని బ్యాంకులో చెల్లిస్తే మాఫీ చేస్తామని ప్రకటించారు. దీంతో నాలుగో విడతపై రైతుల్లో ఆశలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే గతనెల 30న నాలుగో విడత రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటన చేసింది. జిల్లాల వారీగా రేషన్ కార్డులేని రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల పేర్లతో జాబితా విడుదల చేస్తూ మాఫీ మొత్తాన్ని ప్రకటించింది. నాలుగో విడతలో జిల్లాలో 8,792 మంది రైతులకు రూ.75.97 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో కొత్త రుణాలు తీసుకునేందుకు రైతులకు బ్యాంకులకు వెళ్తే.. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే అకౌంట్లలో జమవుతాయని, ఆ తర్వాతే కొత్త రుణాలు తీసుకోవచ్చని బ్యాంకర్ల నుంచి సమాధానం రావడంతో రైతులు వాపోతున్నారు.
జిల్లాలో రుణమాఫీ తీరు
విడత రైతులు సొమ్ము(రూ.లలో)
తొలి 30,055 151,36,18,866
రెండో 13,401 124,40,76,460
మూడో 8,371 103,75,87,629
నాలుగో 8,792 75,97,74,171
మేసేజ్ వచ్చినా బ్యాంకు ఖాతాల్లో జమకాలే
నాలుగో విడత రుణమాఫీపై రైతుల్లో అసంతృప్తి
అనర్హులను తొలగించేందుకే?
నాలుగో విడతలో ప్రకటించిన జాబితాలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, లేదా గోల్డ్‌లోన్ ఉన్న వారు ఎవరైనా ఉన్నారా? అనే అంశాల వారీగా మరోసారి అధికారులు సర్వే చేస్తున్నారు. ఇది పూర్తయ్యాకే నాలుకో విడత రుణమాఫీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. జిల్లాలో రూ.2లక్షలకు పైగా రుణాలు తీసుకున్నవారు మరో 12,971మంది సమారు రూ.124 కోట్లు పొందినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఫ్యామిలీ గ్రూపింగ్‌లో కొంతమంది పోను మిగిలిన వారు 9 వేలమంది వరకు ఉండే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment