రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ధర్మారం(ధర్మపురి): స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థులు సీఎం కప్–2024 రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ గురువారం తెలిపారు. అథ్లెటిక్స్‌లో టి.మనోజ్ఞ, పవిత్ర, సౌజ్ఞశ్రీ ప్రతిభ చూపారని పేర్కొన్నారు. అదేవిధంగా ఫుట్‌బాల్‌లో అశ్రి త, అశ్వితి, వైష్ణవి, హర్షిణి, రచన ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్‌లో వైశాలి, సాఫ్ట్‌బాల్‌లో వైష్ణవి ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆయన వివరించారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌తోపాటు పీఈటీలు బైకని కొము రయ్య, ఎం.సంజీవరావు అభినందించారు.
చెవిలో పువ్వుతో నిరసన
పెద్దపల్లిరూరల్: అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు గురువారం చెవిలో పువ్వులతో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అమరవీరుల స్థూపం వద్ద 17రోజులుగా కొనసాగిస్తున్న దీక్ష శిబిరాన్ని అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, మధుసూదన్‌రావు సందర్శించారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు వారు సంఘీభావం ప్రకటించారు. సమస్యలకు పరిష్కారం చూపే దాకా నిరసన కొనసాగిస్తామని జేఏసీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి హెచ్చరించారు. నాయకులు కుంభాల సుధాకర్, సంధ్యారాణి, రాజ్‌కుమార్, స్వప్న, విజయలక్ష్మి, శ్రీదేవి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర కమిటీలో చోటు
పెద్దపల్లిరూరల్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాష్ట్ర కమిటీలో జిల్లా నాయకుల కు సముచిత ప్రాధాన్యం లభించింది. ఈనెల 23 – 25వ తేదీ వరకు సిద్దిపేటలో జరిగిన రా ష్ట్ర మహాసభల్లో ప్రకటించిన నూతన కమిటీలో జిల్లాకు చెందిన పలువురు నేతలను పదవులు వరించాయి. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన శ్రీపతి సాయితేజకు సోషల్ మీడియా కన్వీనర్‌గా అవకాశం కల్పించారు. అలాగే స్టూడెంట్ ఫర్ డెవలప్‌మెంట్ కో కన్వీనర్‌గా పాలకుర్తి మండలం కొత్తపల్లికి చెందిన మారం సందీప్, స్టూడెంట్ ఫర్ సేవ కో కన్వీనర్‌గా ఎలిగేడు మండలం ధూళికట్టకు చెందిన సందనవేణి ఓమేశ్‌ను నియమించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కమాన్‌పూర్‌కు చెందిన అరవింద్, పెద్దపల్లి మండలం నిమ్మనపల్లికి చెందిన యతిరాజు అజయ్‌ను నియమించినట్టు రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి ప్రకటించారు.
గౌరవ వేతనం ఇప్పించండి
సుల్తానాబాద్(పెద్దపల్లి): పట్టణ పేదరిక ని ర్మూలన సంస్థలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. నెలకు రూ.6 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్న ప్రభుత్వం.. తమకు ఏడు నెలలుగా నిధులు విడుదల చేయడం లేదని వారు పేర్కొంటున్నారు. ఈ విషయంపై శుక్రవారం మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని ఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షురాలు శారద తెలిపారు.
బ్రిడ్జి కోర్సులో ప్రవేశాలు
పెద్దపల్లిరూరల్: ఐటీఐలో 60శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం బ్రిడ్జి కోర్సులో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి తెలిపారు. మెరిట్ ఆధారంగానే ఎంపిక ఉంటుందన్నారు. దరఖాస్తులను 30 జనవరి 2025వ తేదీ వరకు స్వీకరిస్తామని పేర్కొన్నా రు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు పెద్దపల్లిలోని ప్రభుత్వ ఐటీఐలో సంప్రదించాలని ఆయన సూచించారు.
సర్కారు ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ థియేటర్
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే జీజీహెచ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన కంటి ఆపరేషన్ థియేటర్‌ను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనితోపాటు ఆధునికీకరించిన లేబర్ రూమ్, పెయింగ్ రూమ్‌లు, ఏఆర్టీ సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారని మెడికల్ సూపరింటెండెంట్ దయాల్ సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment