మనుధర్మశాస్త్ర పత్రాలు దహనం
మంథని: ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనుధర్మశాస్త్ర పత్రాలను బుధవారం పట్టణంలో దహనం చేశారు. మనుధర్మశాస్త్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు వ్యతిరేకంగా ఉందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గతంలోనే వ్యతిరేకించారని నాయకులు గుర్తుచేశారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అంబేడ్కర్ గురించి పార్లమెంట్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఇకనైనా కేంద్రప్రభుత్వ తమ పద్ధతులు మార్చుకోవాలని వారు సూచించారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బూడిద గణేశ్, మంద రాజేందర్, ఆర్ల సందీప్, బూడిద తిరుపతి, గొర్రంకల సురేశ్, మహేందర్, కడారి సతీశ్, ఇరుగురాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన
Comments
Please login to add a commentAdd a comment