● పుస్తెలతాడు తీసియ్యి.. మళ్లీ ఇస్తా
● వృద్ధురాలిని నమ్మించిన దుండగులు
● రెండు తులాల బంగారంతో ఉడాయింపు
● లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
పెద్దపల్లిరూరల్: ‘అవ్వా.. నీకు పింఛన్ మంజూరైంది.. నేను మీ ఊరికి కొత్తగా వచ్చిన కార్యదర్శిని. ఓ సారి నీ మెడల నుంచి పుస్తెలతాడు తీస్తే ఫొటోతీసుకుని మళ్లిస్తా’ అని నమ్మించిన ఓ నయవంచకు డు రెండుతులాల పుస్తెల తాడుతో ఉడాయించాడు. జిల్లా కేంద్రంలోని మసీదు చౌరస్తా వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మణ్‌రావు కథ నం ప్రకారం.. పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామానికి చెందిన గుర్రాల సత్తమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ పెద్దపల్లిలోని ఆస్పత్రికి వ చ్చింది. వైద్య పరీక్షల అనంతరం ఇంటికి వెళ్లేందు కు మసీదు చౌరస్తా వద్దకు చేరుకుంది. అక్కడ ఆర్టీసీ బస్సుకోసం నిరీక్షిస్తోంది. ఈలోగా ఓ అపరిచితుడు సత్తవ్వ వద్దకు చేరుకున్నాడు. ‘అవ్వా.. నేను మీ ఊ రి కార్యదర్శిని.. నీకు పింఛన్ మంజూరైంది.. పక్కనే ఆర్డీవో ఆఫీసుకు రా’ అని చెప్పాడు. దీంతో వృద్ధురాలు సమీపంలోని ఆర్డీవో కార్యాలయం వరకు వెళ్లింది. ఆ వెంటనే మెడలోని పుస్తెల తాడు తీసివ్వు, వేరొకరికి వేసి ఓ ఫొటో తీసి పుస్తెలతాడు మళ్లీ ఇస్తా అని చెప్పాడు. అప్పటిదాకా తన సెల్‌ఫోన్ వృద్ధురాలి వద్దే ఉంచుకోవాలని సూచించాడు. పుస్తెలతాడు తీసుకుని ఎటోవెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి సెల్‌ఫోన్ తీసుకుని అప్పటికే సిద్ధంగా ఉన్న ఆటోలో ఎక్కి అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో తాను మోసపోయాయని గ్రహించిన సత్తవ్వ.. పెద్దపల్లిలో నివాసం ఉండే తన కొడుకు రాజుకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న రాజు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు సీసీ ఫుటేజీలను పరిశీలించి ప్రాథమిక ఆధారాలను సేకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని ఎస్సై లక్ష్మణ్‌రావు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment