వైద్య సేవలు భేష్
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆ స్పత్రిలో పేదలకు వైద్యసేవలు మెరుగ్గా అందుతున్నాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రశంసించా రు. జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నిరకాల వైద్యసేవలు అందించేందుకు వైద్య నిపుణు లు అందుబాటులో ఉన్నారన్నారు. ఇందుకోసం అన్నివసతులు కల్పించామని, శస్త్రచికిత్సలు చే సేందుకు వీలుగా సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. గతేడాది డిసెంబర్‌లో 7,695 మంది ఔట్ పేషెంట్లు, 838 మంది ఇన్‌పేషెంట్లు చికిత్స పొందారని తెలిపారు. 113 మంది కంటి, 55 మందికి ఎముకల చికిత్స, 33 మందికి జనరల్ శస్త్రచికిత్స చేశామని వివరించారు. పిల్లల విభాగంలో 2,669 మంది ఓపీ, 291 మంది ఇన్‌పేషెంట్లుగా సేవలు పొందారని తెలిపారు. డిసెంబర్‌లో 192 ప్రసవాలు జరిగాయని అన్నారు. అనంతరం పెద్దపల్లి, మంథని సూపరింటెండెంట్లు శ్రీధర్, రాజశేఖర్‌తోపాటు వైద్యులు కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
గోదావరిఖని జనరల్ ఆస్పత్రి సేవలపై సమీక్ష
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సేవలపై కలెక్టర్ శ్రీహర్ష సమీక్షించారు. సేవలు మెరుగుపర్చేందుకు జనరేటర్, పేయింగ్ గదులు, ఏఆర్‌టీ సెంటర్, ప్రసూతి ఇన్సెంటివ్ కేర్ యూనిట్ మంజూరు చేసామని తెలిపారు. వీటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి సేవలు అందుబాటులోకి తేవాలని సూచించారు. సింగరేణి మెడికల్ కాలేజీ నిర్వహణకు సూచనలు చేశారు. డీఎంహెచ్‌వో అ న్న ప్రసన్నకుమారి, దయాల్‌సింగ్, సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబిందుసింగ్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని శనివా రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. పారిశుఽ ద్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల ఆయన అన్నారు. ప్రతీరోజు చెత్త సేకరించాలని సూచించారు. పారిశుధ్య సిబ్బంది పూర్తిస్థాయిలో విధులకు హాజరయ్యేలా ప్రతీరోజు పర్యవేక్షించాలని ఆయన అన్నారు. వందశాతం పన్నులు వసూలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ 97శాతం పూర్తయిందని, పెండింగ్ సర్వేను వెంటనే పూర్తిచేయాలని అన్నారు. అనంతరం జెడ్పీహెచ్‌ఎస్, డంపింగ్‌యార్డ్‌కు ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. కాట్నపల్లిలోని ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను తనిఖీ చేశారు. నర్సరీని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రశంస
Comments
Please login to add a commentAdd a comment