పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించండి
● అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆదేశం
కోల్‌సిటీ(రామగుండం): నగరంలో పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కార్పొరేషన్ ఎఫ్‌ఏసీ కమిషనర్ అరుణశ్రీ ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాలను శనివారం ఆమె ఆకస్మింగా తనిఖీ చేశారు. పారిశుధ్యం నిర్వహణ, అభివృద్ధి పనులపై ఆరా తీశారు. సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పారిశుధ్య పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. మల్కాపూర్‌లోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ భవనం పరిశీలించారు. రెండో డివిజన్ ఇందిరమ్మకాలనీని సందర్శించారు. కమిషనర్, ఇందిరమ్మ ఇళ్ల సర్వే నమోదు తనిఖీ చేశారు. రెండురోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం లక్ష్మీనగర్, కల్యాణ్‌నగర్‌లో అభివృద్ధి ప నులు పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు క లుగకుండా నాణ్యతతో పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. నగరపాలక సంస్థ ఎస్‌ఈ శివానంద్, అసిస్టెంట్ కమిషనర్ రా యలింగు, ఈఈ రామన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment