కు.ని. ఆపరేషన్లపై అవగాహన అవసరం
● డీఎంహెచ్‌వో అన్నప్రసన్న కుమారి
పెద్దపల్లిరూరల్: కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స పద్ధతులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్న కుమారి సూచించారు. కలెక్టరేట్‌లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఆరోగ్య కార్యకర్తలతో ఆమె శనివారం సమావేశమయ్యారు. వారికి పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ, తాత్కాలిక కుటుంబ నియంత్రణ కోసం పరుషులు కండోమ్ వినియోగించడంపై అవగాహన కల్పించాలన్నారు. కోత, కుట్టులేని కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకునేలా దంపతులను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే క్షయ నిర్మూలన కోసం చేపట్టిన నిక్షయ్ శిబిరాల్లో తెమడ పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. వైద్యాధికారులు సిఫారసు చేసిన రక్తనమూనాలను సేకరించి వివరాలను సరిగ్గా నమోదు చేసి ఫలితాలను అదేరోజు అందించేలా చూడాలని ఆదేశించారు. ల్యాబ్ టెక్నీషియన్లు లేకపోతే స్టాఫ్‌నర్స్‌లు రక్త నమూనాలు సేకరించాలని ఆమె సూచించారు. ప్రోగ్రాం అధికారి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment