పర్యాటక క్షేత్రంగా రామగిరి ఖిల్లా
● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
రామగిరి(మంథని): రామగిరి ఖిల్లాను అంతర్జాతీ య స్థాయిలో పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. బేగంపేటలో ఆదివారం కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన ముచ్చటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రా మగిరి ఖిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డితో రూ.ఐ దు కోట్లు మంజూరు చేయించామని గుర్తుచేశారు. ఔషధ మొక్కల నిలయమైన ఖిల్లాను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు. నాయకులు చొప్పరి సదానందం, కల్వల శంకర్, సందెల కుమార్, దాసరి శివ, బర్ల శ్రీనివాస్, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆర్జీ–3 ఏరియా ఐఎన్‌టీయుసీ రూపొందించిన నూతన క్యాలెండర్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు.
‘కోలేటి’ కుటుంబానికి పరామర్శ
కమాన్‌పూర్(మంథని): మాజీ ఎంపీపీ కోలేటి మా రుతి తల్లి సుశీలమ్మ ఇటీవల మృతి చెందగా మంత్రి శ్రీధర్‌బాబు ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం యువకుడు అన్వర్ చేసిన ఆ త్మీయ సత్కారంలో పాల్గొన్నారు. కాగా, గుండారం రిజర్వాయర్‌ను మినీ ట్యాంక్ బండ్‌గా మార్చాలని మాజీ సర్పంచ్ ఓదెలు.. మంత్రికి విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment