నీరుకుల్లలో జడ్జి పూజలు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): నీరుకుల్లలోని శ్రీమానేటి రంగనాయకస్వామి ఆలయంలో మంచిర్యాల జిల్లా జడ్జి అర్పిత ఆదివారం ప్ర త్యేక పూజలు చేశారు. ధనుర్మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చె ల్లించుకున్నారు. ప్రధాన అర్చకులు గోవర్ధనగి రి మనోహరాచార్యులు, రాజ్‌కుమార్ ఆశీర్వచనలు ఇచ్చారు. ఎండోమెంట్ అధికారి శంకర్, క్లర్క్ ప్రవీణ్ తదితరులు జడ్జిని సన్మానించారు.
ఎల్‌వోసీ అందజేత
ధర్మారం(ధర్మపురి): నర్సింహులపల్లికి చెంది న లైశెట్టి లక్ష్మి వైద్యఖర్చుల కోసం ప్రభుత్వ వి ప్ లక్ష్మణ్‌కుమార్ ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాయంలో ఎల్‌వోసీ అందజేశారు. అనారో గ్య సమస్యతో లక్ష్మి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతోంది. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, మాజీ చైర్మన్ కొత్త నర్సింహులు, నాయకుడు స్వామి తదితరులు పాల్గొన్నారు.
హెడ్ ఆఫ్ ప్రాజెక్టుగా చందన్
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు హెడ్ ఆఫ్ ప్రా జెక్టు(హెచ్‌వోపీ)గా చందన్‌కుమార్ సామంత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని హనుమాన్ ఆలయంలో పూ జలు చేశారు. అధికారులతో కలిసి ప్రాజెక్టులో ని సీహెచ్‌పీ, సైలో యాష్ డైక్, కంట్రోల్ రూ మ్‌లు సందర్శించారు. ఇంజినీర్లతో విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై సమీక్షించారు.
‘ఎల్లంపల్లి’లో 18.53 టీఎంసీలు
రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ఆదివారం 18.53 టీఎంసీలు నిల్వ ఉందని నీ టి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రా జెక్టులోకి ఇన్‌ఫ్లో లేదు. కానీ, ప్రాజెక్టు నుంచి 309 క్యూసెక్కులను హైదరాబాద్ మహానగర వాసుల కోసం పంపింగ్ చేస్తున్నారు.
ప్రతిభ చూపిన మాస్టర్ అథ్లెట్
గోదావరిఖనిటౌన్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ స్టేట్ ఛాంపియన్‌షిప్ పోటీ ల్లో కాంటేవాడ రాధ(48) ప్ర తిభ చూపారు. ఐదు కి.మీ. నడక పోటీ మహిళల విభాగంలో కాంస్య ప తకం సాధించారు. యైటింక్లయిన్‌కాలనీకి చెందిన రాధ భర్త బుగ్గాజి ఓసీపీ–1లో ఉద్యోగి.
మల్లన్నకు బోనాలు
ఓదెల(పెద్దపల్లి): ఓ దెల మల్లికార్జునస్వా మి సన్నిధిలో ఆదివా రం భక్తుల రద్దీ పెరిగింది. ఉత్తర తెలంగా ణ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా తరలివచ్చిన భక్తులు ఆలయం చు ట్టూ ప్రదక్షిణలు చేశా రు. మల్లికార్జునస్వామి, శ్రీసీతారామచంద్రస్వామి, ఖండేలరాయుడు, నందీశ్వరులను ద ర్శించుకున్నారు. పూజారులతో పట్నాలు వే యించారు. బోనాలతో నైవేద్యం సమర్పించా రు. ఈవో సదయ్య ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదం
కోల్ సిటీ(రామగుండం): యువత తాత్కాలిక ఆనందం కోసం ర్యాష్ డ్రైవింగ్‌తో విలువైన ప్రాణాలు కోల్పోతోందని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం న గరంలో 5కే రన్ నిర్వహించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. గతేడాది ని బంధనలు ఉల్లంఘించిన వారికి రూ.13 కోట్ల వరకు జరిమానా విధించామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment