రెగ్యులరైజ్ చేయాలి
విద్యాశాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మా ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి. పనిభారం అధికంగా ఉంది. అయినా, మాకు అతి తక్కువ వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వమే చొరవచూపి మా న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలి.
– తిరుపతి, ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు
కుటుంబ పోషణ భారం
సమగ్ర శిక్షా ఉద్యోగులుగా పనిచేస్తున్న మాకు ప్రభుత్వం అందిస్తున్న వేతనం కుటుంబపోషణకు సరిపోవడంలేదు. ఇతర సౌకర్యాలు, వసతులు, ప్రయోజనాలేవీ అందడంలేదు. అనూహ్యంగా అనారోగ్యం పాలైతే కోలుకోవడం కష్టం. ప్రభుత్వం మా విషయంలో సానుకూలంగా స్పందించాలి. – మనోలత, ముత్తారం
ప్రభుత్వమే చొరవచూపాలి
సమగ్ర శిక్షా ఉద్యోగుల డిమాండ్ల ఆమోదానికి ప్రభుత్వమే చొరవ చూపాలి. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి. ప్రతీ ఉద్యోగికి బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం వర్తింపజేయాలి. ఉద్యోగ విరమణ సందర్భంగా రూ.25 లక్షల వరకు ప్రయోజనాలు కల్పించాలి. – కుంబాల సుధాకర్, రాష్ట్ర నేత
●
Comments
Please login to add a commentAdd a comment