నిర్లక్ష్యం చేస్తే చర్యలు
రామగిరి(మంథని): విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఆర్డీవో కాళిందిని హెచ్చరించారు. నాగెపల్లి, నవాబ్‌పేట గ్రామాల్లో సోమ వారం ఆమె నర్సరీలు, సామూహిక మరుగు దొడ్లు పరిశీలించారు. మొక్కల పెంపకం పద్ధ తి ప్రకారం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శైలజరాణి, ఏపీవో లక్ష్మ ణ్, టీఏలు అఖిల, సుప్రియ, ఫీల్ట్ అసిస్టెంట్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
30 వరకు గడువు పొడిగింపు
గోదావరిఖనిటౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఏ, బీకాం, బీ ఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ఐదో సెమిస్టర్ ఫీజును ఈనెల 3వ తేదీ వరకు చెల్లించాలని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జైకిషన్ ఓజా, అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్ సుబ్బారావు తెలిపారు. ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.150, బీఎస్సీ, బీకాం కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు అదనంగా ల్యాబ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆన్‌లైన్ లేదా మీసేవా కేంద్రాల్లో ఫీజు చెల్లించాలని కోరారు. ఐదో సెమిస్టర్ పరీక్ష తేదీ మార్చి 1 నుంచి 6వ తేదీ వరకు, మూడో సెమిస్టర్ పరీక్ష మార్చి 7 నుంచి 13వ తేదీ వరకు, ఒకటో సెమిస్టర్ పరీక్ష మార్చి 15 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వారు వివరించారు.
డిమాండ్లు నెరవేర్చాలి
రామగుండం: రైల్వే లోకో పైలట్ల సమస్యల పరిష్కారం కోసం దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక రైల్వేస్టేషన్ క్య్రూ కంట్రోల్ కార్యాలయం ఎదు ట బైఠాయించి నిరసన తెలిపారు. రామగుండం బ్రాంచి ప్రతినిధి మెట్ట రామారావు మాట్లా డుతూ టీఏకు అనుగుణంగా మైలేజ్, రన్నింగ్ అలవెన్స్ పెంచాలన్నారు. ఖాళీలను భర్తీ చే యాలని, రిస్క్ అలవెన్స్ తదితర సమస్యలు ప రిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కా ర్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు లోకో పైలట్లు ఓవై స్వామి, రజనీకాంత్ పాల్గొన్నారు.
పత్తి క్వింటాలు రూ.7,244
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.7,244 ధర పలికింది. కనిష్టంగా రూ.6,616, సగటు రూ.7,066 గా ధర నమోదైందని మార్కెట్ ప్రత్యేకశ్రేణి కార్యదర్శి దేవరాజ్ పృథ్వీరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
నేటితో గడువు పూర్తి
పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో గణితశాస్త్రం గెస్ట్ లెక్చరర్ పోస్టు కోసం ఈ నెల 7 (మంగళవారం) వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య కోరారు. ఆ సక్తి, అర్హత గల అభ్యర్థులు విద్యార్హతల సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఈనెల 9న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఇంటర్వ్యూ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
20లోగా దరఖాస్తు చేయాలి
పెద్దపల్లిరూరల్: రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ కా ర్పొరేషన్ ద్వారా ఇందిరా మహిళాశక్తి పథకం కింద రుణాల కోసం క్రైస్తవ మహిళలు ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి రంగారెడ్డి కోరారు. నిరుపేద, ఒంటరి, వితంతు, అనాథ మహిళల కు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. సందేహాలు ఉంటే 040–23391067 ఫోన్‌నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.
సామాజిక సేవ చేయాలి
పాలకుర్తి(రామగుండం): ప్రతీఒక్కరు సామాజిక సేవలో ముందుండాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ సూచించారు. కన్నాల జెడ్పీ హైస్కూల్‌లో బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ 26మంది విద్యార్థులకు సై కిళ్లు, 90మంది విద్యార్థులకు బ్యాగ్‌లు, ప్లేట్లు, బడికి రూ.25వేల విలువైన సౌండ్‌బాక్స్‌ను సో మవారం అందజేసింది. ఈ సందర్భంగా దా మోదర్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల వి ద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు కోలేటి రమేశ్, కోలేటి లింగమూర్తి, కో లేటి శ్రీనివాస్, హెచ్‌ఎం కమలాకర్‌రావు, జి ల్లా సైన్స్ అధికారి రవినందన్‌రావు, ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్ సుమలత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment