ఆధునిక సాంకేతికతతో అధిక దిగుబడి
● తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ● డ్రోన్ వినియోగాన్ని విస్తృతం చేయాలి ● రైతులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన
పెద్దపల్లిరూరల్: వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ పంటలు పండి స్తే పెట్టుబడి ఖర్చు ఆదా అవుతుందని కలెక్టర్ కో య శ్రీహర్ష తెలిపారు. పట్టణ శివారు బంధంపల్లి లో వ్యవసాయ పనులకు డ్రోన్ వినియోగించే కేంద్రాన్ని సోమవారం జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. వ్యవసాయం చేసే రైతులు ఆధునిక సాంకేతికతతో కూడిన పరికరాలతో సాగు చేయడం ద్వారా ఖర్చు, సమయం ఆ దా అవుతాయన్నారు. రైతులు నాట్లు వేసిన తర్వాత డ్రోన్ సాయంతో పురుగుమందులు, గడ్డిమందు పి చికారీ చేయడం మంచిదని తెలిపారు. ఏడాదిగా ఈ ప్రాంతంలో 22 డ్రోన్స్ విక్రయించామని, వాటికి అ వసరమైన మరమ్మతులను సైతం ఇక్కడే చేసేలా స ర్వీసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. అంతేకాకుండా మరో ఐదుడ్రోన్లను అద్దె ప్రాతిప్రది కన అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. డ్రోన్, ఇతర సాంకేతిక ప రిజ్ఞానంపై యువతకు రెండు విడతల్లో శిక్షణ ఇప్పించామని, త్వరలోనే వారికి సర్టిఫికెట్లను అందజేస్తా మని కలెక్టర్ చెప్పారు. డ్రోన్ వినియోగంతో సాగు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని, ఈ రంగాన్ని మ రింత విస్తృతం చేస్తామని కలెక్టర్ అన్నారు. ప్ర భుత్వం ద్వారా రాయితీ రుణాలు అందిస్తూ యువతకు నైపుణ్యశిక్షణ అందిస్తామని వివరించారు.
ఎత్తిపోతల ప్రారంభానికి కసరత్తు
రామగుండం: అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి ఎత్తిపోతల పథకం ప్రారంభించేందుకు కలెక్టర్ కో య శ్రీహర్ష సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. సంబంధిత శాఖ ఇంజినీర్లతో పంపుహౌస్ సాంకేతిక అంశాలపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. రూ.70 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలోని 12,146 ఎకరాలు, కుక్కలగూడూర్ పంపుహౌస్ ద్వారా మరో 1,250 ఎకరాల ఆయకట్టు స్థిరీ కరణకు ఈ పథకం ఎంతో దోహదం చేస్తుందని కలెక్టర్ తెలిపారు. దీనిద్వారా ఏటా మూడు పంటలకు సాగు నీటిని సమృద్ధిగా వినియోగించుకునే అవకా శం ఉంటుందని ఆయన అన్నారు. అంతర్గాం తహసీల్దార్ రవీందర్ పటేల్, ఇరిగేషన్ ఈఈ స్వామి, డీఈ శరత్‌బాబు, ఏఈఈ కార్తీక్ పాల్గొన్నారు.
డ్రోన్ వినియోగం తీరుపై ఆరా తీస్తున్న కలెక్టర్
కోయ శ్రీహర్ష, పక్కన డీఏవో ఆదిరెడ్డి తదితరులు
Comments
Please login to add a commentAdd a comment