మెత్తని ఉప్మా.. పలుచని చట్నీ
● ఇలా ఇంట్లో చేసినా నేను తినను ● సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి ● సింగరేణి క్యాంటీన్‌లో నాసిరకం టిఫిన్‌పై ఆగ్రహం ● ఓసీపీ–3 క్యాంటీన్ కుక్ సస్పెన్షన్
గోదావరిఖని: ‘టిఫిన్ ఇలా తయారు చేస్తే నేనైతే ఇంట్లో కూడా అసలే తినను.. మరీ ఇంత అధ్వానంగా ఉంటుందా.. ఉప్మా మెత్తగా, చట్నీ పలుచగా.. రుచిలేకుండా ఉంది’ అని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు కోసం సింగరేణి అందుబాటులోకి తీసుకొచ్చి క్యాంటీన్‌లో అల్పాహారంపై ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. ఇంతజరుగుతున్నా ప్రాజెక్టు అధికారి నాణ్యత ఎందుకు పరిశీలించడం నిలదీశారు. నాణ్యత విషయంలో యాజమాన్యం రాజీపడబోదన్నారు. నిర్లక్ష్యం చేసే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓసీపీ–3 క్యాంటీన్‌ను ఆయన సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. మొదటి షిఫ్ట్ ఉద్యోగులతో కలిసి ఉప్మా తిన్నారు. నాసిరకంగా ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. కుక్‌ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. క్యాంటీన్లలో అల్పాహారం నాణ్యంగా ఉండటం లేదని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ఇటీవల సింగరేణి సీఎండీ బలరాంకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఓసీపీ–3ని సందర్శించిన డైరెక్టర్.. క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ పరిశీలించిన డైరెక్టర్‌కు ఐఎన్‌టీయూసీ నాయకుడు కొత్త సత్యనారాయణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
లక్ష్య సాధనలో ముందుకు సాగాలి
అంతకుముందు ఓసీపీ–3ని సందర్శించిన డైరెక్టర్(ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) వెంకటేశ్వర్‌రెడ్డి.. ఈ ఆర్థిక సంవత్సరం మరో 84రోజుల్లో ముగుస్తుందన్నారు. ఆ లోగా నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, ప్రాజెక్టు అధికా రి మధుసూదన్, ఇంజినీర్ రాజాజీ, మేనేజర్ భరత్ కుమార్, సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్, రక్షణ అధికారి పాపయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment