● హాజరు కానున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
మంథని: మున్సిపల్ పరిధిలో చేపట్టిన ప లు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరు కానున్నారు. ఈమేరకు ఆయన మంగళవా రం పట్టణంలో పర్యటిస్తారు. శ్రీరాంనగర్ వద్ద రూ.6.71 కోట్లతో చేపట్టే సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి ప్రారంభించనున్నారు. పలు వీధుల్లో నిర్మించిన సిమెంట్ రోడ్లు, మురుగు నీటి కాలువలను ఆయన ప్రారంభిస్తారు,. ఫైర్‌స్టేషన్ వద్ద రూ.8.14 కోట్లతో చేపట్టిన సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పు రాతన సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం వద్ద రూ.9.20 కోట్లతో చేపట్టిన మున్సిపల్ నూతన భవన నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించనున్నారు. పురపాలక సంఘం పరిధిలో మూడు వైపులా ఆర్చీల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. కాగా, కాటారం, మల్హర్ మండలాల్లోనూ మంత్రి పర్యటించనున్నారని నేతలు తెలిపారు.
రేపు ఉపకరణాలు పంపిణీ
పెద్దపల్లిరూరల్: కలెక్టరేట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఈనెల 8న దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేయనున్నట్టు జిల్లా సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి వేణుగోపాల్‌రా వు తెలిపారు. గతనెలలో అలింకో శిబిరంలో ఎంపికై న పెద్దపల్లి నియోజవర్గంలోని దివ్యాంగులకే వీటిని పంపిణీ చేస్తారన్నా రు. అర్హులైన వారు ఇంకా ఉంటే మళ్లీ శిబి రం నిర్వహించి ఎంపిక చేస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment