కార్మికుల సమస్యలు పరిష్కరించండి
● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
జ్యోతినగర్(రామగుండం): విద్యుత్ ఉత్పత్తిలో నిత్యం శ్రమించే కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ కోరారు. ఈమేరకు ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆసిఫ్ పాషాతోపాటు ఆదివారం న్యూఢిల్లీలో ఎన్టీపీసీ హెచ్‌ఆర్ డైరెక్టర్ అనిల్‌కుమార్ జాడ్లిని ఎమ్మెల్యే కలిసి వినతిప త్రం అందజేశారు. రామగుండం ప్రాజెక్టులో కాంట్రాక్టు కార్మికులు సమస్యలతో సతమతమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. 65ఏళ్ల వయసు కలిగిన, ఫిట్‌నెస్ ఉన్న కార్మికులను విధులకు అనుమతించాలని, సూపర్ స్పెషాలిటీ వైద్యసే వలు అందించాలని, కార్పొరేట్ తరహాలో ఇంగ్లి ష్ మీడియంలో ఉచిత విద్య అందించాలని, కా ర్మికుల పిల్లలు, యువత, క్రీడాకారులకు అను వుగా ఉండేలా అన్ని సదుపాయాలతో స్టేడియం నిర్మించాలని కోరారు. హైటెన్షన్ టవర్ లైన్(టీజీ ట్రాన్స్‌కో)లను పూర్తిగా తొలిగించాలని, రాజీవ్ రహదారికి రెండు వైపులా సర్వీసు రోడ్డును తహసీల్దార్ కార్యాలయం వరకు పొడిగించాలని విన్నవించారు. హెచ్‌ఆర్ డైరెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే ఫోన్‌ద్వారా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment