మిగిలింది మూడు నెలలే..
● ఇంకా సాధించాల్సిన బొగ్గు ఉత్పత్తి 23.25 మిలియన్ టన్నులు
గోదావరిఖని: ఇంకా మిగిలింది మూడునెలలే.. ఉత్పత్తి చేయాల్సింది 23.25 మిలియన్ టన్నులు.. 9 నెలల్లో సింగరేణి బొగ్గు గనుల సంస్థ 46.75 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. అయితే, ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి ఆశాజనకంగా ఉన్నా.. భూగర్భగనుల్లో మెరుగుపడాల్సిఉంది. సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టిన బలరాం.. ఉత్పత్తి లక్ష్య సాధనపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా లాభాల బాటలో కొనసాగుతున్న ఓసీపీల్లో ఉత్పత్తి పెరిగితేనే లాభాలు ఆర్జించేవీలు ఉందనే ఆలోచనతో ఓసీపీల్లో ఉత్పత్తిపై దృష్టి సారించారు. వర్షాకాలంలో ఉత్పత్తికి అంతరాయం కలుగడంతో ఉత్పత్తి కాస్త తగ్గింది. రాబోయే మూడునెలల్లో అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండటంతో సింగరేణి యాజమాన్యం అప్రమత్తమైంది. మొత్తం 11ఏరియాల అధికారులతో సమీక్షిస్తోంది. నిర్దేశిత గడవులోగా మిలిగిన ఉత్పత్తి లక్ష్యం పూర్తిచేయాలనే పట్టుదలతో ముందుకు సాగుతోంది. అయితే, బొగ్గు గనులపై రక్షణ వారోత్సవాలు, మల్టీడిపార్ట్‌మెంటల్ కమి టీల పర్యటనలు కూడా ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపాయని అంటున్నారు. అయినా, గతనెలతో పోల్చితే డిసెంబరులో రెండుశాతం అదనంగా బొగ్గు ఉత్పత్తి సాధించారు.
కాన్ఫరెన్స్‌లు.. పర్యటనలు
రాబోయే మూడు నెలల్లో బొగ్గు ఉత్పత్తి సాధనకు యాజమాన్యం ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తోంది. అన్ని ఏరియాల అధికారులతో సీఎండీ బల రాం నిత్యం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు. డైరెక్టర్లు ఆయా ఏరియాల్లో పర్యటిస్తూ ఉత్పత్తి లక్ష్య సాధన, వినియోగదారులకు అందించాల్సిన బొగ్గు తదితర అంశాలపై అధికారులు, ఉద్యోగులను అప్రమత్తం చేస్తున్నారు. ఓసీపీలపై పర్యటిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.
బొగ్గు ఉత్పత్తి సమాచారం
2024–25 వార్షిక లక్ష్యం (మిలియన్ టన్నులు) 72
గత సెప్టెంబర్ వరకు
లక్ష్యం(మిలియన్ టన్నులు) 50.61
సాధించింది(మిలియన్ టన్నులు) 46.75
సాధిచిన శాతం 92
మొత్తం ఓసీపీలు 17
భూగర్భగనులు 22
గత డిసెంబర్ వరకు సంస్థ సాధించిన బొగ్గు ఉత్పత్తి(ఏరియాల వారీగా లక్షల టన్నుల్లో)
ఏరియా లక్ష్యం సాధించింది శాతం
ఆర్జీ–1 36.56 32,98 90
ఆర్జీ–2 66.49 63.36 95
ఆర్జీ–3 45.10 44.09 98
ఏపీఏ 3.53 3.71 105
భూపాలపల్లి 32.73 24.10 74
కొత్తగూడెం 102.79 100.08 95
ఇల్లెందు 26.43 33.01 125
మణుగూరు 92.97 85.73 92
బెల్లంపల్లి 26.00 23.62 91
మందమర్రి 26.97 19.82 73
శ్రీరాంపూర్ 46.49 36.31 78
Comments
Please login to add a commentAdd a comment