నామినేషన్ల పరిశీలన పూర్తి
● గ్రాడ్యుయేట్స్ స్థానానికి బరిలో 68.. టీచర్‌స స్థానానికి 16 మంది
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్, టీ చర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ముగిసింది. గ్రాడ్యుయేట్స్ స్థా నానికి 100 మంది అభ్యర్థులు 192 నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో వివిధ కారణాల వల్ల 32 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 68 మందివి ఆమోదించారు. టీ చర్స్ స్థానానికి 17 మంది 38 నామినేషన్లు దాఖలు చేయగా ఒకరి నామినేషన్ రిజెక్ట్ అ యింది. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడు తూ అభ్యర్థులు నామినేషన్ల సమర్పించిన సందర్భంలో ఏవైనా లోపాలు ఉంటే గుర్తించి అ భ్యర్థులకు షార్ట్ మెమోలు ఇచ్చి సరిచేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. సరైన ఫార్మాట్‌లో సమర్పించని నామినేషన్లను తిరస్కరించినట్లు వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నిక ల పరిశీలకులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ రామన్, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్, ఏవో నరేందర్, తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నా రు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సంజయ్ కుమార్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు బెన్హర్ మహేశ్ దూత్ ఎక్క తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment